ఏపీలో కరోనా కల్లోలం- మరో 8600 కేసులు- 86 మరణాలు- కృష్ణాలోనే ఊరట....

ఏపీలో కరోనా కల్లోలం అంచనాలకు కూడా అందకుండా కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేవలం కృష్ణా జిల్లా మినహాయిస్తే మిగతా రాష్ట్రమంతా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్యలోనూ భారీ మార్పులేవీ లేవు. దీంతో మరికొంత కాలం ఈ పరిస్ధితి కొనసాగవచ్చని భావిస్తున్నారు.

గత 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 8601 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1441 కేసులు నమోదు కాగా... అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 154 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అనంతపురం, నెల్లూరు, విశాఖ జిల్లాలు 900కు పైగా కేసులతో కలకలం రేపుతున్నాయి. కర్నూలు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలు 500 కంటే తక్కువ కేసులతో కాస్త ఫర్వాలేదనిపించాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.6 లక్షలకు చేరింది. వీరిలో 2.6 లక్షల మంది కోలుకుని డిశ్చార్‌ అయ్యారు. మరో 89 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ap records 8600 new covid 19 cases and 86 deaths in last 24 hours

మరణాల సంఖ్య మాత్రం దాదాపుగా 80 నుంచి 100 మధ్యలోనే కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 86 మంది చనిపోయారు. వీరిలో అత్యధికంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పదేసి మంది ఉన్నారు. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చనిపయారు. మిగతా జిల్లాల్లో తూర్పుగోదావరి, గుంటూరులో తొమ్మిదేసి, చిత్తూరు, కడపలో ఎనిమిది మంది చొప్పున, శ్రీకాకుళం, విశాఖలో ఏడుగురు చొప్పన, అనంతపురంలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, కర్నూల్లో ఇద్దరు చనిపోయారు. వీరితో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య ..3368కి చేరింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో అన్ని రకాల కోవిడ్‌ పరీక్షలు కలిపి 54463 శాంపిల్స్‌ పరీక్షించారు. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో పరీక్షించిన శాంపిల్స్‌ సంఖ్య 32 లక్షలకు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+