ఏపీలో కరోనా: 8లక్షలు దాటిన కేసులు - కొత్తగా 3,765 మందికి ఇన్ఫెక్షన్ - ఆ4 జిల్లాల్లో..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువ స్థాయిలో నిలకడగా కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య శాఖ శుక్రవారం వెల్లడిచిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 3,765 కొత్త కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి. కొత్త వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8 లక్షలు దాటి, 8,00,684కు చేరుకున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 6,544గా ఉంది.

గడిచిన 24 గంటల్లో 80,238 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, మొత్తంగా 74.28లక్షల టెస్టులు చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలోనే అత్యుత్తమ రికవరీ రేటు కలిగిన ఏపీలో ఇవాళ ఒక్కరోజే 4281 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కొవిడ్ నుంచి కోలుకున్నవాళ్ల సంఖ్య 7,62,419కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 31,771గా ఉంది.

aps COVID-19 cases cross 8-lakh mark with 3,765 new infections

కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లాలో నలుగురు, కడపలో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, కర్నూలులో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు మృత్యువాత పడ్డారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+