Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేపు ఏపీ సచివాలయ ఎన్నికలు-ఉద్యోగుల ఆగ్రహం వేళ కీలకం-జగన్ ఆయన్ను గెలిపించుకుంటారా ?

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు మూడున్నరేళ్ల తర్వాత అసంతృప్తిగా కనిపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఉద్యోగ నేతల ప్రకటనలు వారిపై ఉద్యోగుల నుంచి ఉన్న ఒత్తిడిని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్ర సచివాలయంలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో జరిగిన ఈ ఎన్నికల్ని ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ ఈసారి మాత్రం పోటీ వరకూ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో జగన్ తన అభ్యర్ధిని గెలిపించుకుంటారా లేదా అనే దానిపై భవిష్యత్ రాజకీయాలు, ఎన్నికలూ ఆధారపడబోతున్నాయి.

 ఏపీ సచివాలయ ఎన్నికలు

ఏపీ సచివాలయ ఎన్నికలు

ఏపీలో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగసంఘం ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ఉద్యోగుల వైఖరికి అద్దం పడతాయని చెప్పుకునే ఈ ఎన్నికలను ప్రభుత్వాలు అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటాయి. కేవలం 1225 మంది ఉద్యోగులు మాత్రమే వేసే ఓట్లు అయినా ఇక్కడ గెలిచే నేత.. భవిష్యత్తులో రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధానంగా మారతారు. దీంతో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎవరవుతారన్న దానిపై ఈసారి ఉత్కంఠ నెలకొంది.

 ఎన్నికల నేపథ్యమిదీ

ఎన్నికల నేపథ్యమిదీ

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉద్యోగులకు సర్కార్ పై భారీ అంచనాలున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలక హామీలైన మెరుగైన పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తప్పకుండా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ మద్దతు ఉన్న కాకర్ల వెంకట్రామిరెడ్డికి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా బాధ్యతలు దక్కాయి. ఆయనతో పాటే ప్యానెల్ లో కూడా ప్రభుత్వ అండదండలున్నవారే వచ్చారు. అయితే ఉద్యోగులు కోరుకున్నట్లుగా మాత్రం వీరు పనిచేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల ఇళ్లస్ధలాలు, సీపీఎస్ రద్దు వంటి విషయాల్లో కాకర్ల తీరుపై ఉద్యోగుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో ఈసారి ఆయన్ను ఏకగ్రీవం చేసేందుకు ఉద్యోగులు అంగీకరించలేదు.

 వెంకట్రామిరెడ్డి వర్సెస్ రామకృష్ణ

వెంకట్రామిరెడ్డి వర్సెస్ రామకృష్ణ

సచివాలయ ఉద్యోగుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈసారి వెంకట్రామిరెడ్డికి పోటీగా రామకృష్ణ బరిలో నిలిచారు. దీంతో ఈసారి ఓటింగ్ అనివార్యమవుతోంది. గతంలో ఏకగ్రీవం చేసినప్పటికీ వెంకట్రామిరెడ్డి తమ అంచనాలకు అనుగుణంగా పనిచేయలేదని ఉద్యోగులు భావించడమే ఇందుకు కారణం. దీంతో పాటు ఇటీవల సెక్రటేరియట్ సెక్షన్ ఆఫీసర్ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ప్యానల్ ఓటమి పాలైంది. దీని ప్రభావం కచ్చితంగా ఈ ఎన్నికలపై పడుతోంది. ఈ నేపథ్యంలో రేపు జరిగే అధ్యక్ష ఎన్నికలపై ఉద్యోగ వర్గాల్లో ప్రత్యేక చర్చ జరుగుతోంది.
ఇందులో ఎవరు గెలుస్తారన్న దానిపై చాలా సమీకరణాలు ఆధారపడి ఉండటమే ఇందుకు కారణం.

 జగన్ తన అభ్యర్ధిని గెలిపించుకుంటారా ?

జగన్ తన అభ్యర్ధిని గెలిపించుకుంటారా ?

ప్రస్తుతం సచివాలయఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కాకర్ల వెంకట్రామిరెడ్డికి వైసీపీ సర్కార్ తో పాటు సీఎం జగన్ మద్దతు ఉంది. అలాగే వైసీపీ సర్కార్లో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు కీలక నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాకర్ల మరోసారి గెలిస్తే వైసీపీ ప్రభుత్వానికి ఊరట దక్కనుంది. అలా కాకుండా రామకృష్ణ గెలిస్తే మాత్రం వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులకు ఉన్న ఆగ్రహానికి ఈ ఫలితాలు అద్దం పట్టడం ఖాయం. అలాగే ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం త్వరలో జరిగే ఏపీ ఎన్జీవో ఎన్నికలతో పాటు మరిన్ని ఉద్యోగ సంఘాల ఎన్నికలపై పడటం ఖాయం. దీంతో జగన్ ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగులకు నచ్చజెప్పేలా ప్రయత్నాలు చేస్తారా లేక ఎవరు గెలిచినా ఒకటే అనుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+