వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఉద్యోగుల కష్టాలు: బస్సు దిగి సచివాలయం వరకు పాదయాత్ర

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఏపీ సచివాలయం ఉద్యోగులు తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఆందోళన నిర్వహించారు. గుంటూరు నుంచి వెలగపూడి సచివాలయానికి వెళ్లే బస్సు నాన్‌స్టాప్ సర్వీస్ పేరుతో నడుపుతూ ఆర్డినరీ సర్వీస్ మాదిరిగా అన్ని స్టాపుల్లో ఆపుతున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బయోమెట్రిక్ ఆమల్లోకి రావడంతో సమయానికి చేరుకోలేకపోతున్నామని ఉద్యోగులు వాపోయారు. దీనిపై తాము ఆర్టీసీ ఆర్ఎంకు ఫిర్యాదు చేయగా ఆయన సైతం ఎక్కడా ఆపవద్దంటూ ఆదేశాలు జారీచేసినా సిబ్బంది మాత్రం పట్టించుకోకుండా ఆర్డినరీ సర్వీస్ మాదిరిగా నడుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం ఉదయం గుంటూరు నుండి సచివాలయం విధులకు హాజరయ్యేందుకు బస్ ఎక్కిన ఉద్యోగులు బసు నాన్ స్టాప్ కదా... ఎందుకు అన్ని స్టేజీలలో ఆపుతున్నారు? అని ప్రశ్నించారు. డ్రైవర్, కండక్టర్ ఉద్యోగుల ప్రశ్నకు సమాధానం చెప్పక పోగా, బస్ తాడికొండ అడ్డరోడ్డుకు చేరుకోగానే బస్ ఆపి దిగిపోయారు.

AP Secretariat employees Protest in Guntur over Bus services Issue

ఆ మార్గంలో సచివాలయంకు వెళ్ళు బస్సులను నిలిపివేశారు. కొద్దిసేపు తమ డిమాండ్ తెలియజేస్తూ నినాదాలు ఇచ్చారు. అక్కడితో ఆర్టీసీ అధికారులు స్పందన సరిగా లేక పోవటంతో బస్‌లు ఎక్కేందుకు నిరాకరించిన సచివాలయం ఉద్యోగులు కొంతదూరం పాదయాత్ర నిర్వహించారు.

తమ సమస్యను పరిష్కరించే వరకు సచివాలయానికి వెళ్ళబోమంటూ బస్సు నుంచి కిందకు దిగి ఆందోళన చేశారు మరికొందరు. సచివాలయం కు వెళ్ల వలసిన బస్సులు సమయపాలన లేకుండా ఆర్టీసీ అధికారులు ఇష్టానుసారం నడపటం కారణంగా సమయానికి విధులకు హాజరు కాలేక పోవటం పెద్ద సమస్యగా ఉందని సచివాలయం ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
Andhra Pradesh Secretariat employees Protested in Guntur over Bus services Issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X