కరోనా బారిన ఏపీ సీనియర్ మంత్రి- కుటుంబ సభ్యులతో సహా : మెగాస్టార్ ఆరా..!!
ఏపీలో జగన్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి కరోనా బారిన పడ్డారు. ఆయన తో పాటుగా కుటుంబ సభ్యులు..వ్యక్తిగత సిబ్బందికి సైతం కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. వీరు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీ కేబినెట్ లో కొద్ది కాలం క్రితం పలువురు మంత్రులు కరోనా బారిన పడ్డారు. వారు చికిత్స తరువాత కోలుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం కరోనా తో ఇబ్బంది పడ్డారు. ఆయనకు అందించిన చికత్స పైన కోలుకున్న తరువాత ఆయన వైద్యులను అభినందించారు.
ఇక, ఉత్తరాంధ్రలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్సా సత్యానారాయణ గత వారం అస్వస్థకు గురయ్యారు. పరీక్షలు చేయించగా కరోనా గా నిర్దారణ అయింది. అయితే, ఆయనతో పాటుగా కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది సైతం కరోనా కు ఎఫెక్ట్ అయ్యారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా...కుటుంబ సభ్యులు ఇప్పటికే కోలుకున్నట్లుగా తెలుస్తోంది. మంత్రికి మాత్రం పూర్తిగా తగ్గలేదని సమాచారం. మంత్రి బొత్సాకు ఆరోగ్య పరంగా ఉన్న సమస్యల కారణంగా వైద్యులు ఆయనను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు.

మరో రెండు రోజుల్లో మంత్రి పూర్తిగా కోలుకుంటారని చెబుతున్నారు. మంత్రి బొత్సా ఏపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన మూడు రాజధానుల విషయం పైన చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలకు పలుమార్లు టార్గెట్ అవుతున్నారు. అయితే, ప్రభుత్వ విధానం మేరకు తాము అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తామని..అమరావతి డెవలప్ మెంట్ కు తాము కట్టుబడి ఉన్నామని పలు మార్లు చెప్పుకొచ్చారు. అయితే, కొద్ది రోజులుగా అస్వస్థత కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు..మీడియాకు దూరంగా ఉంటున్నారు.
మంత్రి బొత్సా ఆరోగ్యం పైన సీఎం జగన్ సైతం వాకబు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక, మెగాస్టార్ చిరంజీవి తన బంధువు ఆరోగ్య పరామర్శకు అదే ఆస్పత్రికి వెళ్లిన సమయంలో బొత్సా ఆరోగ్యం పైన డాక్టర్లను ఆరా తీసినట్లు సమాచారం. కరోనా వచ్చిన వారికి ప్రత్యేక సదుపాయాల మధ్య చికిత్స అందిస్తుండటంతో.. ఎవరినీ దగ్గరకు రానీయటం లేదు. మంత్రి ఆరోగ్యం క్రమేణా మెరుగు అవుతున్నట్లుగా మంత్రి సన్నిహితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications