కారులోనే దందా!: ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్ ఏసీపీకి చిక్కారు. డీఎడ్ విద్యార్ధుల సర్టిఫికెట్ల పరిశీలన కోసం కాలేజీ యాజమాన్యాల నుంచి రూ.9.65 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారాలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కడప, చిత్తూరు జిల్లాల్లోని 33 బీఎడ్, డీఎడ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద జాయిన్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్ధి నుంచి రూ. 1000 చొప్పున ఆయన వసూలు చేస్తూ గురువారం ఏసీపీకి దొరికిపోయారు.

తన అనుచరుడు, దళారి అయిన రఫీ ద్వారా ఏపీ ఎస్ఎస్‌సీ డైరెక్టర్ ఆఫీసు ఎదుటే ఓ వాహనంలో వసూళ్ల దందా నడిపిస్తున్న వైనాన్ని చూసి ఏసీపీ అధికారులు విస్తుతపోయారు. ఈ సమాచారంతో గురువారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు డెరైక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

వివరాల్లోకి వెళితే... రాష్ట్రంలో మొత్తం 514 ప్రైవేట్ డీఎడ్‌ కాలేజీలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం, ప్రతి కాలేజీలో 80 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కింద కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. కాలేజీ యాజమాన్యాలు 20 శాతం సీట్లను భర్తీ చేసుకుంటాయి. 2015-16 విద్యా సంవత్సర అడ్మిషన్లలో కన్వీనర్‌ కోటాలో భారీగా సీట్లు మిగిలిపోయాయి.

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

మేనేజ్‌మెంట్‌ సీట్లతోపాటు వీటినీ కాలేజీ యాజమాన్యాలే భర్తీ చేసుకున్నాయి. నిజానికి, కన్వీనర్‌ కోటాలో మిగిలిపోయే సీట్ల విషయంలో ఏమి చేయాలనేది నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి సీట్లను అర్హత కలిగిన వారితో, అంటే డీసెట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులతోనే భర్తీ చేసుకోవాలి.

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

ఈ విషయంలో జీ.వో.నెం.30కి లోబడి ప్రక్రియను పూర్తి చేయాలి. కానీ, చాలా కాలేజీ యాజమాన్యాలు డీసెట్‌లో క్వాలిఫై కాని విద్యార్థులను, అసలు డీసెట్‌ రాయని విద్యార్థులకు కూడా అడ్మిషన్లు ఇచ్చుకున్నాయి. ఇలా, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,600 సీట్లను కట్టబెట్టినట్టు తెలుస్తోంది.

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

కాలేజీ యాజమాన్యాల ఒత్తిడిమేరకు డీసెట్‌ క్వాలిఫై కాని, అసలు డీసెట్‌ రాయని అభ్యర్థులకూ స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాలకింద అడ్మిషన్లు ఇచ్చేలా ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఆయా సీట్లు భర్తీ చేసుకున్న కాలేజీ యాజమాన్యాలు, తమ అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకుని ధృవీకరించుకునేందుకు జిల్లాలవారీగా షెడ్యూల్‌ను ఇచ్చాయి.

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

ఈ క్రమంలో, ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల డీఎడ్‌ కాలేజీల సర్టిఫికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ప్రసన్న కుమార్‌ ధృవీకరించారు. ఈ క్రమంలోనే కడప, చిత్తూరు జిల్లాల కాలేజీల మేనేజ్‌మెంట్లు హైదరాబాద్‌ ఎస్ఎస్‌సీ బోర్డుకు గురువారం వచ్చాయి.

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

ఈ క్రమంలో గుంటూరు జిల్లా వినుకొండలోని వివేకానంద డీఎడ్‌ కాలేజీల నిర్వాహకుడు రఫీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ కార్యాలయానికి ఎదురుగా ఏపీ07సిడబ్ల్యు 0999 నెంబరు ఇన్నోవా కారులో ఈ వసూళ్ల భాగోతానికి పాల్పడ్డాడు. ఒక్కో కాలేజీ యాజమాన్య ప్రతినిధి నుంచి విద్యార్థికి రూ.1000 చొప్పున వసూళ్లు చేసి వాళ్లకు టోకెన్లు ఇచ్చాడు.

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

ఒకరి తరువాత ఒకరిని ప్రసన్నకుమార్‌ వద్దకు సర్టిపికెట్లతో పంపించాడు. అప్పటికే అక్కడికి చేరుకుని ఈ లంచాల బాగోతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన డీఎస్పీ రమాదేవి నేతృత్వంలోని బృందం ఒక్కసారిగా తనిపై దాడి చేసింది. ఘటనాస్థలిలో రూ.9.65 లక్షలను స్వాధీనం చేసుకుంది. ప్రసన్నకుమార్‌ కార్యాలయంతో పాటు రఫీ బస చేసిన హోటల్‌లో అర్ధరాత్రి దాకా ఏసీబీ సోదాలు నిర్వహించింది.

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

ఏసీబీకి చిక్కిన ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్న కుమార్

ప్రసన్నకుమార్ అనుచరుడిగా ఉన్న రఫీది ఆది నుంచి అక్రమాల చరిత్రే. క్లాస్‌ 4 ఉద్యోగి కుమారుడైన రఫీ గుంటూరు జిల్లా వినుకొండలో 3 దశాబ్దాల క్రితం 50 మంది పిల్లలతో ఓ చిన్న పాఠశాల ప్రారంభించాడు. కానీ ఇప్పుడు 23 బీఎడ్ కాలేజీలకు అధిపతిగా ఉన్నాడు. వినుకొండలో ఒకే ప్రాంగణంలో ఏకంగా 8 కాలేజీలను నిర్వహిస్తున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Anti-Corruption Bureau sleuths on Thursday caught Andhra Pradesh Secondary School Education Board Director Prasanna Kumar red-handed while accepting a bribe of Rs10 lakh from a school management for running diploma in education course.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి