మరికాసేపట్లో ఏపీ టెన్త్ రిజల్ట్స్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షా ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ అనౌన్స్ చేయనుంది. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఎప్పుడో ముగిసినా స్కూళ్లు విద్యార్థులకు సంబంధించి ఇంటర్నల్ మార్కులు బోర్డుకు సకాలంలో పంపకపోవడంతో ఫలితాల విడుదలలో ఆలస్యమైంది. దీనికి తోడు ఎలాంటి తప్పుడు దొర్లకుండా రిజల్ట్స్ ఇచ్చే ప్రయత్నం చేయడంతో ఫలితాల విడుదల కాస్త ఆలస్యమైంది.
పరీక్షా ఫలితాలను విద్యార్థులు ఆర్టీజీఎస్ పోర్టల్ (www.rtgs.ap.gov.in) ఏపీ ఫైబర్ టీవీ, ఖైజాలా, పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏపీలో మార్చి 2, 839 సెంటర్లలో 15 నుంచి ఏప్రిల్ 3 వరకు పదో తరగతి పరీక్షలు జరగాయి. ఈ ఏడాది 6,17,484 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.

Links
www.rtgs.ap.gov.in
https://bit.ly/2E1cdN7
https://aka.ms/apresult












Click it and Unblock the Notifications