ఎంపీపీ...జెడ్పీ ఛైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ : తేదీలు ఇవే..వైసీపీ అభ్యర్ధుల ఖరారు : అధికారికంగా..!!

జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రాత్రికి పూర్తిగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక, దీంతో తరువాతి ప్రక్రియకు రంగం సిద్దం అవుతోంది. కీలకమైన ఎంపీపీ..జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎంపికకు సంబంధించిన ఎన్నికకు నోటీఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నెల 24న ఎంపీటీసీలు..తమ ఎంపీపీని ఎన్నుకుంటారు. మండల ఉపాధ్యక్ష ఎన్నిక అదే రోజు ఉండనుంది. అదే విధం గా..కీలకమైన జిల్లా పరిషత్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ఈ నెల 25న ఉండనుంది.

ఇప్పటికే జిల్లాలకు ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారులను నియమించింది. గతంలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే మేయర్.. ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించిన విధంగానే వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేసి పాలక వర్గాల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక, అన్ని జిల్లాల్లోనూ తమదే విజయం అనే ధీమాతో ఉన్న వైసీపీ ఇప్పటికే అన్ని జిల్లాలకు తమ జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్ధులను ఖరారు చేసింది. రిజర్వేషన్ల ఆధారంగా ఏ జిల్లాకు ఎవరు జిల్లా పరిషత్ ఛైర్మన్ అవ్వాలో డిసైడ్ చేసారు.

AP state Election Commission issued notification for election of MPP and ZP chairman

అందులో భాగంగా.. విజయనగరం - మజ్జి శ్రీనివాసరావు, విశాఖపట్నం - శివరత్నం, గుంటూరు - క్రిస్టినా, ప్రకాశం - బూచేపల్లి వెంకాయమ్మ, పశ్చిమగోదావరి - కవురు శ్రీనివాస్‌, కృష్ణా - ఉప్పాళ్ల హారిక, కడప - ఆకేపాటి అమర్నాథరెడ్డి, నెల్లూరు - ఆనం అరుణమ్మ పేర్లు ఖరారు చేసారు. మిగిలిన జిల్లాల్లో ఇద్దరు అభ్యర్దుల చొప్పున ఆవాశాహుల జాబితాలో ఉన్నారు. దీంతో..వారి పేర్లను ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక, ఎంపీపీ పదవుల విషయంలోనూ ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన విధానంతో ఉన్నారు.

పార్టీ అమలు చేస్తున్న విధంగా ఎంపీపీ పదవుల్లోనూ సామాజిక సమతుల్యత పాటించాలని ఇప్పటికే స్పష్టం చేసారు. ఇప్పటికే స్థానికంగా ఎమ్మెల్యేలు..మంత్రులు తమ నియోజకర్గాల్లో ఎంపీపీల ఎంపిక విషయంలో ఒక క్లారిటీతో ఉన్నారు. దీంతో..ఫలితాలు పూర్తిగా వెల్లడైన తరువాత పార్టీ అధికారికంగా వారిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 25వ తేదీ నాటికి అన్ని జిల్లాల్లోనూ జిల్లా పరిషత్ లు కొలువు తీరనున్నాయి. అదే రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం సైతం నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+