జనస్పందన లేదు, సమీకరించండి - అచ్చెన్న ఆడియో వైరల్..!!
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో అనూహ్య పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ ను టీడీపీ నేతలు నిరసిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు అధికారులు ముఖ్య టీడీపీ నేతలను బయటకు రాకుండా నియంత్రించారు. ఇదే సమయంలో చంద్రబాబు కేసు వాదనలు జరుగుతున్న కోర్టు వద్ద జనసమీకరణ చేయాలంటూ అచ్చెన్నాయుడు పార్టీ నేతలకు సూచించి ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
చంద్రబాబు అరెస్ట్ తో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ముఖ్య నేతలను ముందస్తు అరెస్ట్ చేసారు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలపైన పార్టీ ముఖ్య నేతలు ఫోకస్ చేసారు. చంద్రబాబు అరెస్ట్ ను ప్రభుత్వ కుట్రగా చెప్పటంగా ద్వారా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ తరువాత ఆశించిన స్థాయిలో ప్రజా స్పందన లేదనేది పార్టీ నేతల వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. ఈ సమయంలోనే చంద్రబాబును ఈ ఉదయం విజయవాడ సీఐడీ కోర్టులో ప్రవేశ పెట్టారు. వాదనలు కొనసాగున్నాయి. ఈ సమయంలోనే విజయవాడలో జనసమీకరణపైన అచ్చెన్నాయుడు పార్టీ నేతలతో టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు.
విజయవాడ కోర్టులో విచారణ జరిగే సమయంలో పార్టీ నేతలకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక సూచనలు చేసారు. విజయవాడ నగర పార్టీ నేతలు మూడు నియోజకవర్గాల నుంచి జనసమీకరణ పైన ఫోకస్ చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు.

ఈ సమయంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ కారణంగా తాము సమీకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పార్టీ నేతలు అచ్చెన్నకు వివరించారు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయినా, ఆశించిన స్థాయిలో స్పందన లేదంటూ పార్టీ నేతలు ఆ టెలికాన్ఫిరెన్స్ లో చెబుతున్నట్లుగా స్పష్టం అవుతోంది. ఇప్పుడు పార్టీ నేతలతో అచ్చెన్న మాట్లాడిన అంశాలు...జనసమీకరణపైన చేసిన సూచనల ఆడియో బయటకు వచ్చింది.
జనసమీకరణ చేయాలంటూ నేతలకు చెప్పినా అచ్చెన్నాయుడు. ఆడియో లీక్#Atchannaidu #Chandrababu #ChandrababuArrest #CBNArrest #TDP #AndhraPradesh pic.twitter.com/SZb0R68EDF
— oneindiatelugu (@oneindiatelugu) September 10, 2023
సీఐడీ సమర్పించిన చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో ఈ కేసులో లోకేశ్ తో పాటుగా అచ్చెన్నాయుడు పేరును ప్రస్తావించారు. మంత్రి రోజా ఈ కేసులో తరువాతి అరెస్ట్ ఈ ఇద్దరే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అటు కోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. తమకు ఈ కేసులో ఎటువంటి లబ్ది జరగలేదని..నిరూపించాలని అచ్చెన్నాయుడు సవాల్ చేసారు. ఈ సమయంలో పార్టీ విజయవాడ నేతలతో జరిగిన టెలి కాన్ఫిరెన్స్ ఆడియో ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications