ఏపీ టూ తెలంగాణా గంజాయి స్మగ్లింగ్: కొబ్బరికాయల మాటున; 2 వేల కిలోల గంజాయి సీజ్ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి దందా విపరీతంగా సాగుతోందని ఏపీ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నా, ఏపీ గంజాయి దేశవ్యాప్తంగా సరఫరా అవుతుందని, అంతర్జాతీయంగా కూడా ఏపీ నుండి గంజాయి దందా సాగుతుందని ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా గంజాయి స్మగ్లర్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. చాప కింద నీరులా గంజాయి దందా సాగిస్తున్నారు. పోలీసులకు పట్టుబడకుండా అక్రమ రవాణాకు గంజాయి స్మగ్లర్లు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఏ వాహనంలో గంజాయి పోతుందో తెలియని పరిస్థితి గంజాయి అక్రమ రవాణాను కట్టడి చేయాలనుకున్న పోలీసులకు, ఎస్ఈబీ అధికారులకు తలనొప్పిగా మారుతోంది.

 విశాఖ నుండే గంజాయి అక్రమ రవాణా .. స్మగ్లింగ్ కు అడ్డదారులు

విశాఖ నుండే గంజాయి అక్రమ రవాణా .. స్మగ్లింగ్ కు అడ్డదారులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వివిధ నిత్యావసర వస్తువులతో అంతర్ రాష్ట్ర రవాణా కార్యకలాపాలలో భాగంగా తిరుగుతూ ఉంటాయి. ఈ వాహనాలను అన్నింటిని తనిఖీ చేయడం సాధ్యం కాని పని. కానీ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా జరుగుతున్న గంజాయి సాగు, గంజాయి అక్రమ రవాణా, ఏ వాహనంలో ఏముందో, ఏ మార్గంలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందో అర్థంకాని పరిస్థితికి కారణంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీలో చాలా కాలంగా గంజాయి సాగు జరుగుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో నమోదవుతున్న కేసులు చూస్తే గంజాయి దందా విపరీతంగా పెరిగిపోయిందన్న భావన కలుగుతుంది.

 అక్రమ రవాణా అవుతున్న గంజాయిని మాత్రమే పట్టుకుంటే దందా ఆగుతుందా ?

అక్రమ రవాణా అవుతున్న గంజాయిని మాత్రమే పట్టుకుంటే దందా ఆగుతుందా ?

ఒకప్పుడు రెవెన్యూ, ఎక్సైజ్, నార్కోటిక్స్ అధికారులతో పాటు పోలీసులు కూడా గంజాయి క్షేత్రాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసేవారు కానీ ఇప్పుడు గంజాయి క్షేత్రాలపై దాడులు పెద్దగా చేస్తున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఇక దిహే విషయాన్ని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పేర్కొన్నారు. కేవలం అక్రమ రవాణా అవుతున్న గంజాయిని పట్టుకుని కేసులు నమోదు చేస్తూ కట్టడి చేయాలని ప్రయత్నిస్తోంది ఏపీ ప్రభుత్వం. అధికార యంత్రాంగం పట్టుకుంటున్న గంజాయి కేసుల కంటే, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్న గంజాయి ఎక్కువగా ఉందన్న చర్చ ప్రస్తుతం ఏపీలో జరుగుతుంది.

 నిత్యావసరాల మాటున గంజాయి స్మగ్లింగ్ ..కొబ్బరికాయల మాటున భారీ గంజాయి

నిత్యావసరాల మాటున గంజాయి స్మగ్లింగ్ ..కొబ్బరికాయల మాటున భారీ గంజాయి

నిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు గంజాయిని వివిధ మార్గాల ద్వారా చేరవేస్తున్నారు. ఉల్లిపాయలు లారీలు, ఆలుగడ్డల లారీలు, బొగ్గుల లారీలు, అంబులెన్సులు, టూవీలర్లు, కార్లు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు, రైళ్ళు ఇలా ఒకటేమిటి గంజాయి అక్రమ రవాణాకు స్మగ్లర్లు వినియోగించని రవాణా సాధనం లేదు. తాజాగా తూర్పుగోదావరి విశాఖపట్నం జిల్లాల సరిహద్దుల నుండి హైదరాబాద్ కు కొబ్బరికాయల మాటున తరలిస్తున్న రెండు వేల కిలోల గంజాయిని మోతుగూడెం పోలీస్ స్టేషన్ వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు.

ఏపీ టూ హైదరాబాద్ .. 2 కోట్ల విలువైన గంజాయి సీజ్

ఏపీ టూ హైదరాబాద్ .. 2 కోట్ల విలువైన గంజాయి సీజ్

ఏపీ సరిహద్దు జిల్లాల నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు రెండు వేల కిలోల గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ సుమారు 2 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు .తూర్పుగోదావరి జిల్లా చింతూరు పరిధిలో రెండు కోట్ల విలువైన గంజాయిని సీజ్ చేశామని చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా లింగాపురం మండలం కొత్తపల్లి చెందిన ఒక న్యాయవాది కడియం గురు సాగర్ కూడా ఈ దందాలో ఉన్నట్టు పేర్కొన్నారు.

రెండు వేల కిలోల గంజాయి సీజ్ .. పట్టుబడని గంజాయి కేసులెన్నో

రెండు వేల కిలోల గంజాయి సీజ్ .. పట్టుబడని గంజాయి కేసులెన్నో

నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం గంట్రావు పల్లికి చెందిన పగిడాల పర్వతాలుతో పాటు మరొకరిని గంజాయి అక్రమ రవాణా వ్యవహారంలో అరెస్ట్ చేశామని చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నారు . రెండు వేల కిలోల గంజాయి తో పాటు ఒక వ్యాన్ ను, ఒక కారును, రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక ఇలా ఏపీలో నమోదవుతున్న కేసులలోనే కాదు వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్న గంజాయి కేసుల్లోనూ ఏపీలోనే మూలాలు ఉన్నాయన్న వార్తలు వెల్లువగా మారాయి. పట్టుబడిన ఇలాంటి కేసులే కాకుండా, పట్టుబడని ఎన్నో కేసులు గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఉంటున్నాయి. ఏపీలో గంజాయి సాగుపై ఇంత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో కూడా గంజాయి అక్రమ రవాణా సాగుతుండడం, గంజాయి పట్టుబడుతున్న తీరు సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

 గతంలోనూ గంజాయి సాగు .. కానీ ఇప్పుడే ఏపీ గంజాయిపై చర్చ

గతంలోనూ గంజాయి సాగు .. కానీ ఇప్పుడే ఏపీ గంజాయిపై చర్చ

గతంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు జరిగిందని ఏపీ ప్రభుత్వం వాదిస్తున్నా, అప్పట్లో ఏపీలో గంజాయి సాగు పై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు. ప్రస్తుతం ఏపీలో గంజాయి సాగు పై, ఇతర రాష్ట్రాల స్మగ్లింగ్ గ్యాంగులు రంగంలోకి దిగి దందా సాగిస్తున్నాయని, అడ్డుకుంటే దాడులకు పాల్పడుతున్నారని , చర్చ జరుగుతున్న క్రమంలో గంజాయి పై ఉక్కుపాదం మోపాలంటే గంజాయి క్షేత్రాలను ధ్వంసం చేయడమే ప్రభుత్వం ముందున్న కింకర్తవ్యం.

Recommended Video

    Living Together Relationships Increasing ఓవైపు గంజాయి.. మరోవైపు సహజీవనాలు | Oneindia Telugu
    వచ్చే నెలల్లో మరింత జోరుగా గంజాయి దందా .. అడ్డుకట్ట వెయ్యకుంటే కష్టమే !!

    వచ్చే నెలల్లో మరింత జోరుగా గంజాయి దందా .. అడ్డుకట్ట వెయ్యకుంటే కష్టమే !!


    నవంబరు డిసెంబరు నెలలలో గంజాయి పంట చేతికి వస్తుంది కాబట్టి అప్పుడు మరింత ఎక్కువగా గంజాయి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే గంజాయిని ధ్వంసం చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే కొబ్బరికాయలు, ఉల్లిపాయలు ఇలా ఏపీ నుండి వెళ్ళే ప్రతి వాహనాన్ని తనిఖీ చెయ్యాల్సిందే. అలా చెయ్యలేని పరిస్థితిలో గంజాయి యధేచ్చగా ఇతర రాష్ట్రాలకు చేరిపోతుంది. ప్రతిపక్షాలు విమర్శించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదకద్రవ్యాల హబ్ గా మిగిలిపోతుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+