ఏపీలో కొత్త పెన్షన్లు - రేషన్ కార్డుల పునరుద్దరణ..!?
ఏపీలో కొత్త ప్రభుత్వం వైపు పెన్షన్ లబ్దిదారులు ఆశగా చూస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక పింఛన్ల మంజూరు ఏడాదిగా నిల్చిపోయింది. దీంతో, సుమారు మూడు లక్షల మంది పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వ హాయంలో తొలిగించిన రేషన్ కార్డులను పునరిద్దరిస్తారని భావిస్తున్నారు. ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, ప్రభుత్వం తీసుకొనే తాజా నిర్ణయం కోసం లక్షలాది మంచి వేచి చూస్తున్నారు.
పెన్షన్ల కోసం
వైసిపి ప్రభుత్వ హయాంలో నవశకం పథకంలో భాగంగా ఏటా జనవరి, జులై నెలల్లో కొత్త వారికి పింఛన్లు మంజూరు చేస్తూ వచ్చింది. అయితే, గతేడాది జులై, ఏడాది జనవరిలో పింఛన్లు మంజూరు చేయకుండా దరఖాస్తులన్నింటినీ పెండింగ్‌లో పెట్టేసింది. దీంతో, రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం 2023 జనవరికి ముందు దరఖాస్తు చేసుకున్న వారికి జులైలో అనుమతి మంజూరు చేసింది. 2023 జులై ఒకటో తేదీ నుంచి 23వ తేదీ వరకు జగనన్న సురక్షలో బియ్యం కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది.

రేషన్ కార్డులపై
దీంతో, జులై వరకు పెండింగ్‌లో ఉన్న పింఛన్ల దరఖాస్తులకు ఆమోదం తెలిపి వారికి మాత్రమే పింఛన్లు మంజూరు చేసింది. ఆ తర్వాత కొత్త వారికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినా మంజూరు చేయలేదు. కొత్తగా రేషన్ కార్డుల దరఖాస్తులను గతేడాది డిసెంబరు వరకు అనుమతి ఇచ్చినా పింఛన్లకు అనుమతి ఇవ్వలేదు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు ఎన్నికల ముందు అవకాశం ఇస్తారని భావించినా అలా జరగలేదు. బియ్యం కార్డుల జారీ ప్రక్రియ ఏడు నెలలుగా, కొత్త పింఛన్ల మంజూరు ఏడాదిగా పెండింగ్‌లో ఉంది.
ఆమోదం కోసం
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్‌లో ఉన్న పింఛన్లకు, రేషన్ కార్డుదారులకు క్లియరెన్సు ఇవ్వలేదు. కొత్త పింఛన్లకు దరఖాస్తులను కూడా స్వీకరించడం లేదు. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు కూడా పింఛన్ల కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 2021లో నవశకం సర్వే తరువాత 7 లక్షల రేషన్ కార్డులను తొలగించారు. వీరిలో 60 శాతం మంది తమకు అర్హత ఉన్నా కార్డులను తొలగించారని, కొత్త ప్రభుత్వమైనా కార్డులను పునరుద్ధరించాలని అభ్యర్దిస్తున్నారు. అర్హులు అందరికీ పథకాలు అందిస్తామని ప్రభుత్వం చెప్పటంతో లబ్దిదారులు ఆశతో ఉన్నారు. దీంతో, ప్రభుత్ తుది నిర్ణయం నై స్పరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications