ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు బిగ్ షాక్.. 361 బస్సులపై కేసులు, 40 సీజ్ !!
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలపై విస్తృత స్థాయి ప్రత్యేక తనిఖీలు ప్రారంభించింది. ప్రజల భద్రతను ప్రధానంగా ఉంచుకొని, రవాణా శాఖ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా స్వయంగా దీనిపై దృష్టి సారించారు.
రెండురోజుల్లో 361 బస్సులపై కేసులు..
రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా జరిగిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 361 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. వీటిలో సుమారు 40 బస్సులను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సుల యజమానులకు హెచ్చరికలు జారీ చేస్తూ, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. తనిఖీల్లో అనుమతి లేకుండా సీటింగ్ మార్చిన 63 బస్సులను అధికారులు గుర్తించారు. ట్రావెల్స్ సంస్థలు బస్సులను లగ్జరీగా మార్చి.. సీట్లు పెంచి లాభాల కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్నట్లు బయటపడింది.

అలాగే అగ్నిమాపక పరికరాలు లేని 83 బస్సులపై కేసులు నమోదయ్యాయి. అత్యవసర ద్వారాలు లేని 11 బస్సులపై జరిమానాలు విధించారు. అంతేకాకుండా సరైన ఫైర్ అలారం లేదా రక్షణ వ్యవస్థలు లేని 14 బస్సులను కూడా అధికారులు గుర్తించి సీజ్ చేశారు. కొన్ని ట్రావెల్స్ సంస్థలు అనుమతి లేకుండా పార్సిళ్లు, సరుకులు రవాణా చేస్తున్నట్లు కూడా తనిఖీల్లో బయటపడింది. ఇలాంటి 11 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేసి, భారీ జరిమానాలు విధించారు. రవాణా అనుమతులు ఉన్న వాహనాల్లో వాణిజ్య సరుకు రవాణా చేయడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
తనిఖీల్లో నంద్యాల జిల్లాలో అత్యధికంగా 66 కేసులు నమోదయ్యాయి. పల్నాడు జిల్లాలో 36, ప్రకాశం జిల్లాలో 34, తిరుపతిలో 25, చిత్తూరులో 8, కర్నూలులో 14, ఎన్టీఆర్ జిల్లాలో 42, అన్నమయ్య జిల్లాలో 21 బస్సులపై కేసులు నమోదయ్యాయి. రవాణా శాఖ అధికారులు తనిఖీలతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడంపైనా దృష్టి సారించారు. ప్రమాద సమయంలో అత్యవసర ద్వారాలు ఎలా ఉపయోగించాలి, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ను ఎలా నడిపించాలి అనే అంశాలపై ప్రయాణికులకు ప్రత్యక్ష ప్రదర్శనలు చూపిస్తున్నారు.
రవాణా శాఖ సమాచారం ప్రకారం, ఇలాంటి ఉల్లంఘనలపై ఇకపై రాజీ ఉండదని స్పష్టం చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు భద్రతా పరికరాలు, బస్సుల పరిస్థితులు, డ్రైవర్ల అర్హతలు వంటి అంశాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే బస్సుల అనుమతులను రద్దు చేసే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. ఇక త్వరలోనే బస్సు డ్రైవర్లు, సిబ్బందికి రవాణా శాఖ ప్రత్యేక భద్రతా శిక్షణా శిబిరాలు నిర్వహించనుంది. మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. పాత బస్సులను రోడ్లపై నడపరాదని కూడా అధికారులు తెలిపారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్‌డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications