ఏపీలో ఓటేసే హైదరాబాదీలు ఎందురు - మద్దతెవరికి..!!
ఏపీలో ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ప్రచారం చివరి దశకు చేరింది. ప్రధాని మోదీ ఈ రోజు ఏపీలో పర్యటిస్తున్నారు. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తూనే పార్టీలు చివరి ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఏపీలో ఓటు హక్కు ఉంది ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు తిరిగి వస్తున్నారు. వీరి సంఖ్య ఎంత.. ఏ పార్టీకి
మద్దతిస్తారదనే ఇప్పుడు కీలకంగా మారుతోంది.
హోరా హోరీ పోరు
ఈ సారి ఏపీ ఎన్నికల్లో హోరాహోరీ సమరం సాగుతోంది. ప్రతీ సీటు..ప్రతీ ఓటు కీలకంగా మారుతోంది. దీంతో...తమ నియోజకవర్గ ప్రజలు ఎక్కడ ఉన్న అభ్యర్దులు వాలిపోతున్నారు. వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీలో ఓటు హక్కు ఉండి హైదారబాద్ లో నివస్తున్న వారి మద్దతు కోసం అభ్యర్దులు అనేక వ్యూహాలు అమలు చేస్తున్నారు. గతంలో 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఇక్కడ నివశించే ప్రజలు కేసీఆర్ నేతృత్వంలోని గులాబీ పార్టీకి జైకొట్టారు. అంతెందుకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైనప్పటికీ గ్రేటర్ మొత్తం స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై పెద్ద ఎత్తున ఉత్కంఠ జరుగుతోంది.

ఓటర్ల కోసం ప్రయత్నాలు
ఏపీపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. దీంతో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. పార్టీలు, ఇక అభ్యర్థులు గెలవడం కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా లెక్కలు వేసుకొని హైదరాబాద్ లో ఉన్నవారిని తెప్పించడానికి టీమ్స్ ఏర్పాటు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఏపీ వాసుల ఓట్లపై రెండు పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. హైదరాబాద్ లో ఏపీ జిల్లాల్లోంచి వచ్చి పనులు చేసుకునేవారిలో మెజార్టీ ప్రజలు అనేక రంగాల్లో ఉద్యోగులుగతో పాటుగా.. కూలీనాలీ చేసుకొనే వారు ఎక్కువగానే ఉన్నారు. ఐటీ, ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగుల కంటే పేదలు, మధ్యతరగతి ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ఏపీలో జగన్ సర్కారు ఏర్పడ్డాక డబుల్ ఓట్లపై ఆ పార్టీ ఈసీకి అనేక ఫిర్యాదులు చేసింది.
మద్దతు దక్కేదెవరికి
హైదరాబాద్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండటంతో పెద్ద ఎత్తున రాయలసీమ ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఇక్కడ సెటిల్ అయిపోయారు. అదే సమయంలో చాలామంది హైదరాబాద్ లో సెటిలైనప్పటికీ... ఏపీలో ఓటు హక్కును కంటిన్యూ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఏపీ నుంచి వచ్చే ఓటర్లు ఎంతమంది ఎన్నికల్లో పాల్గొంటారనేదానిపై పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైనప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ స్వీప్ చేయడానికి కారణం ఏపీ ఓటర్లేనన్న చర్చ ఉంది. ఏపీ ఓటర్లలో అటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేనలను సమర్థించే ఓటర్లు కూడా ఉన్నారు. పోలింగ్ సమయానికి వారిని స్వస్థలాలకు రప్పించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో..ఈ ఓటర్ల మద్దతు ఎవరికి ఉంటుందనేది కీలకంగా మారుతోంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications