Severe Rainfall Alert:వెదర్ అలర్ట్..7 జిల్లాలపై ప్రభావం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో దక్షిణకోస్తాలో అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

 వర్షాలు..

వర్షాలు..

ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. 11, 12వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగళాఖాతం..దాని సమీప ప్రాంతాల్లో ఏర్పడే అల్పపీడనం.. 48 గంటల్లో బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయువ్యంగా..ఉత్తర తమిళనాడు తీరం దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు.

 7 జిల్లాలపై ఎఫెక్ట్

7 జిల్లాలపై ఎఫెక్ట్

11, 12 తేదీల్లో చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయి. విజయనగరం, కర్నూలు, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దన్నారు. ఆదివారం భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా అతాలకుతలమైన సంగతి తెలిసిందే. నెల్లూరుతో పాటు చిత్తూరులో కూడా భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాల్లోకి వరద నీరు పోటెత్తింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు నీట మునిగిపోయాయి.

తమిళనాడులో కూడా

తమిళనాడులో కూడా

ఈ నెల 10, 11 తేదీల్లో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం తదితర సముద్రతీర జిల్లాల్లో ఆ రెండు రోజులపాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చెన్నైకి నీరందించే జలాశయాలైన పూండి, సెంబరంబాక్కం నుంచి ముంపు ముప్పు ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+