AP Weather: ఏపీలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు, ఈశాన్య గాలులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే భారీ వర్షాలతో సమస్యలను ఎదుర్కొంటుండగా.. మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. బంగాళా ఖాతం నుండి దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఈ గాలులు ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణం సూచనలు చెప్పారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .

దక్షిణ కోస్తాంధ్ర ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్లకురిసే అవకాశముంది. మంగళవారం తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రానున్న మూడు రోజులపాటు రాయలసీమ లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
వాగులో కొట్టుకుపోయిన ఆటో: ముగ్గురు మృతదేహాలు లభ్యం
డిసెంబర్ 9న నెల్లూరు జిల్లాలో సంగం సమీపంలోని బీరాపేరు వాగులో ఆటో కొట్టుకు పోయిన ఘటనలో గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు బయపటపడ్డాయి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మూడు రోజులుగా సాగిస్తున్న గాలింపులో కర్రా పుల్లయ్య, కర్రా నాగరాజు, కర్రా పద్మ మృత దేహాలను వెలికితీశాయి. మిగిలిన ఇద్దరు కర్రా సంపూర్ణ, దివనపు ఆదెమ్మ ఆచూకీ ఇంకా లభించలేదు. వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు, గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలిస్తున్నారు. అధికారులు ఘటనా స్థలంలోనే ఉంటూ గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
గాలింపులో లభించిన ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాలుగు రోజులు నీటిలో ఉండంతో బాడీలు పూర్తిగా కుళ్లిపోయాయి. కటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దూరం నుంచే కడసారిగా చూస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. మిగిలిన ఇద్దరు కర్రా సంపూర్ణ, దివనపు ఆదెమ్మ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. కడసారి చూపైనా దక్కితే చాలనుకుంటున్నారు.
Recommended Video
నాలుగు రోజుల క్రితం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి సంగం శివాలయంలో నిద్ర చేసేందుకు 12 మంది ఆటోలో బయల్దేరారు. సంగం సమీపంలోని బీరాపేరు వాగుపై ఉన్న వంతెన దాటుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో వాగులో పడిపోయింది. పోలీసులు, రహదారిపై వెళ్తున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టి ఏడుగురిని వాగులోంచి కాపాడారు. వారిలో కర్రా నాగవల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.












Click it and Unblock the Notifications