weather: ఏపీలో రానున్న మూడు రోజుల్లు అధిక ఉష్ణోగ్రతలు, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఎండలు మరింతగా తీవ్రమవుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కాగా, తూర్పు ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల నుండి అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ప్రస్తుతం తెలంగాణ నుంచి రాయలసీమ. కర్ణాటక మీదుగా అంతర్గత తమిళనాడు వరకు, సగటు సముద్ర మట్టానికి 0 .9 కి మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వాతావరణం పొడిగి ఉండే అవకాశం ఉంది.

అంతేగాక, ఎండలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారుల ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతంలో శని, ఆదివారాల్లోవాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. సోమవారం తేలికపాటి వర్షాలు అక్కడక్క కురిసే అవకాశం ఉంది.
ఇక దక్షిణ కోస్తాంధ్రలో శని, ఆది, సోమవారాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. రాయలసీమలో నేటి నుంచి రానున్న మూడు రోజుల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు పెరుగనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications