AP Weather Update: ఏపీలో రేపు ఇక్కడ వర్షాలు-అక్కడ మాత్రం ఎండలే..!

ఏపీలో రుతుపవనాల రాక వేళ మిశ్రమ వాతావరణ పరిస్ధితులు (AP Weather) కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఎండలు మండుతుండగా.. మరికొన్ని చోట్ల మాత్రం వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా దాదాపు ఇలాంటి పరిస్ధితులే ఉంటాయని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. విదర్భ మీదుగా ఉత్తరాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ద్రోణి విస్తరించి ఉందని అధికారులు తెలిపారు.

దీని ప్రభావంతో సోమవారం అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకస్మికంగా ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

AP Weather Update Unsettled Skies to Continue Tomorrow Across Andhra Pradesh IMD Issues Forecast

మరోవైపు పోలవరం, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు, మార్కాపురం,బాపట్ల, పల్నాడు,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో *42-44* డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నంద్యాల, వైఎస్ఆర్ కడప,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో *40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+