ఆస్ట్రేలియాలో ఏపీ మహిళా డాక్టర్ మృతి-ట్రెక్కింగ్ చేస్తూ కాలుజారి లోయలో...!
ఏపీకి చెందిన మహిళా యువ డాక్టర్ ఒకరు ఆస్ట్రేలియాలో దుర్మరణం పాలయ్యారు. కృష్ణాజిల్లా ఎలుకపాడు గ్రామానికి చెందిన ఉజ్వల అనే మహిళ వృత్తి రీత్యా డాక్టర్. కొంతకాలంగా ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. నిన్న స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లిన ఆమె.. ప్రమాదవశాత్తూ కాలు జారి లోయలోకి పడిపోవడంతో మృత్యువాత పడ్డారు. దీంతో రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా పోలీసులు తల్లితండ్రులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో డాక్టర్ గా సేవలందిస్తున్న కృష్ణాజిల్లా ఉంగుటూరు వాసి ఉజ్వల వీకాఫ్ కావడంతో స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోయారు. రక్షించేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. దీంతో స్నేహితులు చూస్తుండగానే లోయలోకి పడిపోయి చనిపోయారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు ఆస్పత్రికి వెళ్లారు.

ఉజ్వల మరణంతో ఆమె స్వగ్రామం ఉంగుటూరు మండలం ఎలుకపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉజ్వల మరణ వార్త విని తల్లిదండ్రులు ,కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆస్ట్రేలియా గోల్డ్కస్ట్లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఉజ్వల.. ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఆమె మృతదేహాన్ని కృష్ణాజిల్లాలోని స్వగ్రామానికి తరలించనున్నారు. అక్కడే ఆమెకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications