వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కరోనా విలయం:మద్యంపై మరో షాక్.. జగన్‌పై మహిళల ఆగ్రహం.. ఎన్టీఆర్ రావాలన్న వైసీపీ

|
Google Oneindia TeluguNews

అసలే కరోనా విలయం.. రాష్ట్రంలో కేసుల సంఖ్య 1800కు చేరువైంది.. పైగా ఎండాకాలం.. 'అయితేనేం? ఎంచక్కా గొడుగులు పట్టుకునిమరీ క్యూలైన్లో ఎదురుచూస్తాం.. ఎలాగైనేసరే మద్యం సేవిస్తాం..' అని ఉరకలేసే మందుబాబులకు మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే మద్యం ధరలను 75 శాతం పెంచేసిన జగన్ సర్కారు.. ఇకపై ఆయా జోన్లలో మద్యం అమ్మకాలకు సంబంధించి మరో కఠిన నిబంధన తీసుకొచ్చింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల మహిళలు రోడ్డెక్కి, లిక్కర్ షాపుల ముందు ఆందోళకు దిగారు. ఇదే విషయమై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది.

రెండో రోజూ అదే జోరు..

రెండో రోజూ అదే జోరు..

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం మొదలైన మద్యం అమ్మకాలు.. రెండోరోజైన బుధవారం కూడా జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3468 అధికారిక మద్యం షాపులకుగాను.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని 2345 మద్యం దుకాణాలు మాత్రమే తెరుచుకున్నాయి. మొదటిరోజుతో పోల్చుకుంటే తోపులాటలు, లాఠీ ఝుళిపింపులు తగ్గినా, ఫిజికల్ డిస్టెన్సింగ్ నిబంధన మాత్రం పక్కాగా అమలుకావడంలేదు. కొన్ని చోట్ల గొడుగుతో భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. కాగా, అమ్మకాలకు సంబంధించిన అసలు సమస్యపై సర్కారు సీరియస్ గా దృష్టిపెట్టింది. అదేంటంటే..

అడ్రస్ చూపిస్తేనే మందు..

అడ్రస్ చూపిస్తేనే మందు..

రెడ్ జోన్లలో కఠిన నిబంధనలు కొనసాగుతున్నా.. అక్కడి మందుబాబులు ఎలాగోలా సందు చూసుకుని గ్రీన్ జోన్లలోకి ప్రవేశించి, మద్యం కొనుకెళుతున్న దృశ్యాలు అంతటా కనిపించాయి. దీంతో అలెర్ట్ అయిన అధికారులు.. కొత్త నిబంధనలు విధించారు. రెడ్ జోన్ నుంచి వచ్చే వాళ్లకు మద్యం అమ్మరాదని ఆదేశాలు జారీచేశారు. అంటే, ఫలానా మండలంలోని మద్యం షాపులో ఆ మండలానికి చెందినవాళ్లకే అమ్ముతారు తప్ప, బయటి వ్యక్తులను అనుమతించరు. ఆధార్ కార్డులో అడ్రస్ ప్రూఫ్ ను బట్టి ఆయా వ్యక్తుల జోన్లను నిర్ధారించుకున్న తర్వాతే బాటిల్ చేతులో పెడతారు. తాజా నిబంధనపై మందబాబులు గగ్గోలు పెడుతున్నారు.

మహిళల నిరసనలు..

మహిళల నిరసనలు..


గుడులు, బడులు మూసేఉంచి, మద్యం దుకాణాలను మాత్రమే తెరవడంపై మహిళలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం విశాఖపట్నంలో చోటుచేసుకున్నట్లే.. బుధవారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మహిళా సంఘాలు రోడ్లపైకొచ్చి వైన్ షాపుల ముందు నినాదాలు చేశారు. తెరిచిన దుకాణాలను వెంటనే మూసేయాలని డిమాండ్ చేశారు. పేదవాడికి పని చూపించాలే తప్ప మద్యం వద్దని మహిళా సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. వైన్ షాపుల వద్ద వందలాదిగా గుమ్మికూడుతోన్న మందుబాబుల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందని, అసలు మద్యాన్నే నియంత్రిస్తానన్న ముఖ్యమంత్రి ఇలాంటి టైమ్ లో అనుమతులివ్వడం ఎంతవరకు సబబని మహిళలు ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలోనైతే మహిళలు పోలీసులతోనూ వాదులాటకు దిగారు.

అదీ జగన్ అవగాహన..

అదీ జగన్ అవగాహన..

మద్యం దుకాణాల వద్ద టీచర్లతో కాపలా కాయించడంపై ప్రతిపక్ష టీడీపీ భగ్గుమంది. సమాజమంతా గురువుల్ని దైవంగా భావిస్తే, జగన్ అవగాహన మాత్రం వేరని, గతంలో సీఎం ఓ కార్యక్రమంలో ‘‘గురుదేవా మహేశ్వరం''అని సెలవిచ్చినట్లుగానే తన పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారని, కాబట్టే లిక్కర్ షాపుల దగ్గర టీచర్లను కాపలా పెట్టించడంలో తప్పులేదని ఆయన భావిస్తున్నారని ప్రతిపక్షం మండిపడింది. కోరిమరీ జగన్ కు ఓటేసిన మేధావులంతా ఇప్పుడీ చిత్రాలు చూసి తలలు పట్టుకుంటున్నారని టీడీపీ ఎద్దేవా చేసింది.

Recommended Video

Coronavirus Lockdown Extended In Telangana Till May 29th
ఎన్టీఆర్ కొరడా తీయాలి..

ఎన్టీఆర్ కొరడా తీయాలి..

టీడీపీ విమర్శలకు ఘాటుగా బదులిచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ చంద్రబాబును తూర్పారా పట్టారు. గతంలో విశాఖలో హుద్ హుద్ తుఫాను సమయంలో ఎన్టీఆర్ ట్రస్టు అక్రమంగా రూ. 100కోట్ల వసూళ్లు చేసిందని ఆరోపించారు. ‘‘ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు. మద్య నిషేధాన్ని వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌ ట్రస్టును లాక్కున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నారు. తుఫాను బాధితులకు అంటూ కలెక్షన్లులాగి కోట్లు మింగేశారు... ఏ లోకంలో ఉన్నారోగానీ, ఎన్టీఆర్‌గారూ... మీ అల్లుడి అరాచకాల మీద ఇక కొరడా తీయండి''అని విజయసాయి రాసుకొచ్చారు.

English summary
On second day also several women across andhra pradesh protest aginst liquor shops, slaming cm jagan's decision. in the same isue, dilouge war between ruling ysrcp and opposition tdp continues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X