వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్‌లో బీజేపీ ఓడితే 8న ఏపీలో దీపావళి చేసుకుంటాం: రఘువీరా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడితే నవంబర్ 8న దీపావళి చేసుకుంటామని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

APCC Chief Raghuveera reddy fires on Bjp Government

ఇటీవల వారణాసి స్థానిక ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 స్ధానాలు మాత్రమే గెలిచి 50 స్థానాల్లో ఓటమి పాలైందన్నారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దత్తత తీసుకున్న జయపూర్‌‌లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసిందన్నారు. వరంగల్ ఉపఎన్నికలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా ప్రచారం చేస్తామన్నారు.


బెజవాడ బీజేపీ ఆఫీస్‌పై దాడి చేసిన విద్యార్థులకు రిమాండ్‌

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడలోని బీజేపీ ఆఫీస్‌పై దాడి చేసిన విద్యార్థులను సోమవారం రిమాండ్‌కు తరలించారు. నలుగురు విద్యార్థులకు ఈనెల 16 వరకు విజయవాడ కోర్టు రిమాండ్‌ విధించింది. బీజేపీ ఆఫీసుపై దాడి చేయడంతోపాటు అనుమతి లేకుండా ప్రవేశించి అక్కడ ఆస్తులు ధ్వంసం చేసినట్లు వారిపై నాన్ బెయిలబుల్‌ కేసులు పెట్టారు.

వివరాల్లోకి వెళితే.... ఆదివారం సాయంత్రం బీజేపీ ఆఫీస్ వద్ద ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు విద్యార్ధులు యత్నించారు. ఆ సమయంలో అక్కడ సమావేశం జరుగుతుండటంతో బీజేపీ కార్యకర్తలు విద్యార్థులను అడ్డుకుని వారిపై దాడి చేశారు.

ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులను స్టేషన్‌కు తీసుకువెళ్లారు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపిస్తామని చెప్పి, విడిచిపెట్టకుండా విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. దీంతో సోమవారం కోర్టు వారికి ఈ నెల 16 వరకు రిమాండ్‌ విధించింది. విద్యార్థులకు మద్దతుగా రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ సీఎం కార్యాలయానికి ముట్టడించేందుకు వస్తున్న నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
APCC Chief Raghuveera reddy fires on Bjp Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X