జగన్ కూ, మాకూ తేడా లేదు-ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ ..మళ్లీ రెచ్చిపోయిన షర్మిల..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో తనకు నెలకొన్న కుటుంబ ఆస్తుల వైరాన్ని రాజకీయం ద్వారా మరో స్దాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఆయన చెల్లి, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ మాటల దాడిని మరింత తీవ్రం చేశారు. ఇప్పటికే జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదని, వెళ్లకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేసేయాలని ఒత్తిడి పెంచుతున్న షర్మిల.. దీనికి రోజుకో కారణాన్ని లింక్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ సూపర్ సిక్స్ పథకాలు, బడ్డెట్ ను జత చేసి పోస్టు పెట్టారు.

ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కానీ బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ వైసీపీ కంటే ముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందన్నారు. తాము చెప్పిందే జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారన్నారు. మీకూ, మాకు పెద్ద తేడా లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డికి 38 శాతం ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్ళనప్పుడు, మీకు మాకు తేడా లేదని గుర్తుచేశారు.

apcc chief ys Sharmila suggests brother ys jagan to discuss super six promises failure in assembly

38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోనీ వైసీపీని నిజానికి ఒక అప్రాధాన్య పార్టీగా మార్చింది జగనే అన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని , అసమర్థ వైసీపీ ఇవ్వాళ రాష్ట్రంలో అసలైన అప్రాధాన్య పార్టీ అన్నారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదన్నారు. సొంత మైకుల ముందు కాదు..అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని జగన్ కు షర్మిల సూచించారు. మీకు చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయాలని కోరారు.

ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోవాలని షర్మిల సూచించారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయాలన్నారు. ఎన్నికలకు వెళ్ళండి. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+