నన్నే ఓడించ లేకపోయారు - సీఎం జగన్ ను ఏం ఓడిస్తారు: ఉద్యోగ సంఘ నేత సంచలనం..!!
తాను జగన్ బంటునేనని ఏపీజీఈఎఫ్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వాధినేత సీఎం కాబట్టి తాను జగన్ బంటునేనని తేల్చి చెప్పారు. గత ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు పైన విమర్శలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని బహిరంగంగా పిలుపునివ్వటం పైన ఇప్పుడు చర్చ మొదలైంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్న ప్రభుత్వంగా చెప్పుకొచ్చారు.

ప్రభుత్వాధినేత సీఎం కాబట్టి జగన్ బంటునే
వెంకట్రామిరెడ్డి కొద్ది నెలల క్రితం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు తన విజయం గురించి ప్రస్తావించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరామని.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పుకొచ్చారు. రెండు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని అడిగామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున పెండింగ్ డీఏలు ఇవ్వలేకపోయామని చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిశాక పెండింగులో ఉన్న డీఏల్లో ఒక డీఏ ఇస్తామని స్పష్టం చేశారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని.. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం భూ కేటాయింపులు చేస్తామని ప్రభుత్వం చెప్పిందని చెప్పుకొచ్చారు. సీపీఎస్ ఉద్యమంలో పెట్టిన కేసులను ఎత్తేస్తామన్నారని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.

గత ప్రభుత్వంలో ఏసీబీ దాడులపై
గ్రామ, వార్డు సచివాలయాల్లో బదిలీలను త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం సర్వీస్ రూల్స్, జాబ్ ఛార్ట్ సిద్దం చేస్తామని మంత్రి బొత్స, సజ్జల హామీ ఇచ్చారని చెప్పారు. గత ప్రభుత్వంలోనే ఉద్యోగ సంఘాల నేతలను టార్గెట్ చేసుకుని ఏసీబీ దాడులు జరిగాయని వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వం మూడు కులాల ఉద్యోగులను లక్ష్యంగా పెట్టుకుని ఏసీబీ దాడులు చేపట్టిందని ఆరోపించారు. అప్పటి సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయలేదని చెప్పుకొచ్చారు. గతంలో 170 మంది ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయించిందని విశ్లేషించారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల నేతలపై ఏసీబీ దాడులు చేయించ లేదన్నారు. తాను సీఎం జగన్ బంటునేనని తేల్చి చెప్పారు.

సీఎంను ఏం ఓడిస్తారు
తననే ఓడించ లేకపోయారు.. సీఎం జగన్ ను ఏం ఓడిస్తారని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఉద్యోగులను కోరారు. రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా వస్తున్నా.. చిరుద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయని వివరించారు. గత ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక్క నెలలో అయినా ఒకటో తేదీన జీతాలు పడ్డాయా అంటూ ప్రశ్నించారు. అయితే, వెంకట్రామిరెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులను గెలిపించాలంటూ పిలుపునివ్వటం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications