జగన్ వద్దనుకునే వరకూ ఆయనే ముఖ్యమంత్రి - ఉద్యోగ సంఘ నేత..!!
సీఎం పదవి తనకొద్దనే వరకూ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ తరువాత కొత్త పోస్టులు భర్తీ చయాలని కోరామని వెల్లడించారు. సీఎం జగన్ గురించి వెంకట్రామి రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
వృద్దాప్యం వచ్చి..కర్ర పట్టుకొని నడుస్తూ సీఎం పదవి తనకొద్దనే వరకూ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని వెంకట్రామరెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆగస్టు 12న ఏపీజీఈఎఫ్ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను సీఎం పరిష్కరించారని చెప్పుకొచ్చారు.

జీపీఎస్ పైన స్పష్టత లేనందునే కొందరు ఉద్యోగుల్లో ఆందోళన ఉందని చెప్పారు. ప్రభుత్వం, ఉద్యోగులకు ఉభయ తారకంగా ఉండేలా జీపీఎస్ తీసుకొచ్చారని వివరించారు. నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వానికి 131 సమస్యలను నివేదిస్తే 38 అంశాలపై సానుకూలంగా స్పందించారని వెంట్రామిరెడ్డి పేర్కొన్నారు.
వీఆర్ఏ, వీఆర్వో, ఎంపీడీవో పదోన్నతులు..ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ తరువాతనే కొత్త పోస్టులు భర్తీ చేయాలని కోరినట్లు చెప్పారు. దీని పైన సీఎం సానుకూలంగా స్పందించారని వివరించారు. సచివాలయంలో తాజాగా నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగలందరి రెగ్యులర్ కు ఒకే జీవో ఇస్తామని చెప్పారని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులు పని చేసే చోట రెగ్యులర్ చేసేంత వరకు కొత్త నోటిఫికేషన్లు వద్దని కోరామని వివరించారు. జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు వంద ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ స్కీంలు ఇవ్వాలని..జీతాలు పెంచాలని కోరినట్లు వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు .












Click it and Unblock the Notifications