చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తితో..

రాష్ట్ర విద్యుత్ చ‌రిత్ర‌లో మొద‌టి సారి ఏపీ జెన్ కో 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్ప‌త్తితో లైఫ్ టైం రికార్డు సాధించ‌డం గొప్ప విష‌య‌మ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌వ‌ర్ జ‌న‌రేష‌న్ కార్పొరేష‌న్ (జెన్ కో)ను స్థాపించిన ద‌గ్గ‌ర‌ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ నమోదు కాని విధంగా 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 5730 మెగావాట్ల ఎక్స్-బస్ ఉత్పత్తి సాధించ‌డం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దార్శ‌నిక‌త‌తో ఇచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌లతో పాటు జెన్ కో సిబ్బంది ప్ర‌త్యేక కృషి ప్ర‌ధాన‌ కార‌ణ‌మ‌ని మంత్రి పేర్కొన్నారు.

జెన్ కో సాధించిన అసాధార‌ణ విజ‌యం సంద‌ర్భంగా జెన్ కో అధికారుల‌తో గురువారం నాడు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స‌చివాల‌యం నుంచే వీడియో కాన్ఫ‌రెన్స్ లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. జెన్ కో అధికారులను అభినందించారు. గృహ‌, పారిశ్రామిక‌, వ్యాపార అవ‌స‌రాల‌కు నిరంత‌రాయ విద్యుత్ స‌ర‌ఫ‌రానే ల‌క్ష్యంగా అధికారులు ప‌ని చేయాల‌ని సూచించారు. జెన్ కో సాధించిన రికార్డు ఉత్ప‌త్తిలో పాలుపంచుకున్నసిబ్బంది అంద‌రికీ మంత్రి గొట్టిపాటి ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

వేసవి విద్యుత్ అవ‌స‌రాల‌ కోసం ముందస్తు చర్యలు..

రాబోయే వేసవిలో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశముందని మంత్రి గొట్టిపాటి అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సంస్థలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గృహ‌, పారిశ్రామిక‌, వ్యాపార‌ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ అందించే ల‌క్ష్యంతో దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తితో పాటు రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్‌ను కూడా విజయవంతంగా తీర్చడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సానుకూల సంకేతమని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ముఖ్యంగా రాబోయే వేస‌వి నెలల్లో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల‌కు మంత్రి సూచించారు. విద్యుత్ అంత‌రాయాల‌కు అవ‌కాశం లేకుండా చూడాల‌న్నారు.

మౌలిక వ‌స‌తుల బ‌లోపేతంతో భారం తగ్గింపు

గత వైసీపీ ప్రభుత్వ హ‌యాంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ జెన్ కో ను సర్వనాశనం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధ‌ర‌ల‌కు అత్య‌ధికంగా విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజల పై రూ. 32 వేల కోట్ల భారాన్ని మోపారని విమర్శించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ హయాంలో ఏకంగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీల‌ను పెంచి సామాన్య ప్ర‌జ‌ల‌పై భారం వేశారన్నారు.

APGenco Hit Historic 6160 MW Record Energy Minister Gottipati Ravikumar Hails Lifetime Achievement

సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం వినియోగ‌దారుల‌పై భారం త‌గ్గించేందుకు అనేక చ‌ర్య‌లు చేప‌డుతుంద‌న్నారు. ఇందులో భాగంగానే దేశంలో ఎక్క‌డాలేని విధంగా 13 పైసల ట్రూ డౌన్ ను ఇప్ప‌టికే అమలు చేసి కొత్త చ‌రిత్ర సృష్టించింద‌ని తెలిపారు. అదే విధంగా విద్యుత్ వ్య‌వ‌స్థ‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించామ‌ని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని విద్యుత్ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేసే ల‌క్ష్యంతో వేల కోట్ల రూపాయిల‌తో వంద‌లాది స‌బ్ స్టేష‌న్లు నిర్మిస్తున్నామ‌న్నారు. కొత్త విద్యుత్ లైన్ల‌ను కూడా వేస్తున్నామ‌ని మంత్రి గొట్టిపాటి వెల్ల‌డించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+