విశాఖపట్నం వెళ్లేవారికి ముఖ్య సూచన
వాల్తేర్ డివిజన్‌లోని కెకె లైన్ లో బొర్రా గుహల నుంచి కరకవలస మధ్య వంతెన పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో విశాఖపట్నం నుంచి కిరండూల్ వెళ్లే రైలును రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది. విశాఖ నుంచి బయలుదేరాల్సిన కిరండూల్ రైలు 08551 ఈనెల 10 వ తేదీన రద్దయింది. అలాగే కిరండూల్ నుంచి బయలుదేరే 08552 కిరండూల్ విశాఖపట్నం రైలు కూడా రద్దయింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు. రద్దీని తగ్గించేందుకు మూడు ఏసీ ఎకానమీ కోచ్ లు ఏర్పాటు కూడా చేసినట్లు తెలిపారు.
అరకు, జగదల్ పూర్ ప్రయాణానికి రోజురోజుకు డిమాండ్ పెరగడంతో ఏసీ కోచ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని ప్రయాణికులంతా ఉపయోగించుకోవాలని కోరింది. ప్రస్తుతం ఉన్నది వేసవికాలం కావడంతో ఏసీ ప్రయాణానికి డిమాండ్ పెరుగుతోందని, అందుకనుగుణంగా ఏసీ కోచ్ లు ఏర్పాటు చేస్తున్నామని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. భవిష్యత్తులో కూడా మరిన్ని రైళ్లకు ఏసీ కోచ్ లను ఏర్పాటు చేస్తామని, స్లీపర్ కన్నా ఏసీకి డిమాండ్ ఉండటంతోనే వీటిని ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

విశాఖపట్నం నుంచి విజయవాడ మార్గం పూర్తి రద్దీగా ఉంటుంది. ఈ లైను డబుల్ ట్రాక్ అయినప్పటికీ రద్దీని నియంత్రించేకపోతుండటంతో మూడోలైను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సర్వే జరుగుతోంది. తర్వాత పనులు ప్రారంభం కానుంది. దీంతోపాటు విజయవాడ-గూడూరు మధ్య కూడా మూడోలైను ఏర్పాటు చేస్తున్నారు. హౌరా, భువనేశ్వర్, విశాఖపట్నం నుంచి చెన్నై, తిరుపతి, రేణిగుంటవైపు వెళ్లడానికి రద్దీని నియంత్రించినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. విజయవాడ-గూడూరు, విశాఖపట్నం-విజయవాడ మధ్య మూడో రైల్వే లైను అందుబాటులోకి వస్తే రైళ్ల ప్రయాణంలో ఎటువంటి ఆలస్యం చోటుచేసుకోదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications