ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!
మరో మూడు రోజుల్లో ప్రస్తుత ఆర్దిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ తో విద్యా సంవత్సరం సైతం పూర్తి కానుంది. ఇప్పటికే జూన్ నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ను ప్రకటించారు. వేసవి సెలవుల పైన తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు. ఇక, ఏప్రిల్ లో కొత్త ఆర్దిక సంవత్సరం.. కొత్త లెక్కలు ప్రారంభించనున్న బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. దీంతో, వినియోగదారులకు ఆర్బీఐ అలర్ట్ జారీ చేసింది.
2026 ఏప్రిల్ నెలలో పండుగలు, వార్షిక ముగింపు, వారాంతపు సెలవుల కారణంగా అనేక రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆర్బీఐ ఖరారు చేసిన సెలవుల ప్రకారం ప్రకారం నెల మొదటి రోజు, అంటే ఏప్రిల్ 1న బ్యాంకులు మూసి ఉంటాయి. దీనిని ఆర్థిక ఖాతాల వార్షిక ముగింపు రోజుగా పాటిస్తారు. ఇది తప్పనిసరి సెలవుదినం కాబట్టి, దేశవ్యాప్తంగా చాలా బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్ 2న మౌనీ గురువారం సందర్భంగా కేరళలో సెలవు ఉండనుంది. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైశాఖి వంటి పండుగల నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. అలాగే ఆదివారాలు 5, 12, 19, 26 తేదీల్లోనూ బ్యాంకులకు సెలవు ఉండనుంది. 11, 25 తేదీల్లో రెండు, నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవులు రానున్నాయి.

విద్యా సంస్థలకు వేసవి సెలవులు
బ్యాంకులకు సెలవు వేళ ఆన్ లైన్ బ్యాకింగ్ తో పాటుగా ప్రత్యామ్నాయ బ్యాకింగ్ సేవలను సద్విని యోగం చేసుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది. ఇక.. ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 3 (శుక్రవారం) - గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14 (మంగళవారం) - డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సెలవు ప్రకటించారు. కాగా..ఏప్రిల్ 24, 2026 నుండి జూన్ 11, 2026 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఇంటర్ కాలేజీలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 1న కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 5 నుంచి 9 వరకు క్వార్టర్లీ పరీక్షలు, దసరా సెలవులు అక్టోబరు 10 నుంచి 20 వరకు ఉంటాయని ఇప్పటికే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. బడులు తెరిచిన తొలి రోజే అంటే జూన్ 12వ తేదీన విద్యార్ధులందరికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు.












Click it and Unblock the Notifications