ఈదురుగాలుల బీభత్సం, కుమ్మేసిన వాన - ఈ జిల్లాలకు లేటెస్ట్ అలర్ట్స్..!!

ఏపీలో పలు జిల్లాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉండగా.. మరి కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలుల బీభత్సంతో వాన కుమ్మేసింది. పలు జిల్లాల్లో జిల్లాల్లో రాత్రి గాలులు మొదలై.. అర్ద్రరాత్రి వరకు కొనసాగాయి. జూన్‌ 3,4 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.

పలు జిల్లాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జల మయం అయ్యాయి. విద్యుత్ కోతలతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. కాగా, రుతువపనాల పైన వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ ఇచ్చింది. ఇప్పటికే రుతుపవనాలు లక్షద్వీప్‌నకు చేరుకున్నాయ ని.. వచ్చే వారంలో మరింత విస్తరిస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో శుక్రవారం మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాగా వెల్లడించారు.

APSDMA issued red alert for many districts in the state over rains for next two days here the details

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 5-10 తేదీల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

ఫలించిన నిరీక్షణ - ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీం, వీరికే వర్తింపు..!!
ఫలించిన నిరీక్షణ - ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీం, వీరికే వర్తింపు..!!

మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం

కృష్ణా జిల్లా గుడివాడలో ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ఎండ మిడిసిపడగా.. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. వర్షానికితోడు ఈదురుగాలులు బీభత్సం కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఉమ్మడి ప్రకాశం, కడప జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. ఉమ్మడి కృష్ణా , గుంటూరు జిల్లాల్లోనూ వర్షం కుురుస్తోంది. విజయవాడ, జగ్గయ్యపేట, మైలవరం, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది.

విజయవాడలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సింగ్ నగర్, వాంబే కాలనీ, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే, విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+