ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - నేడు, రేపు అప్రమత్తంగా ఉండండి..!!
ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక వైపు రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటేసాయి. ఈ రోజు రేపు వడగాల్పుల తీవ్రత వఎక్కువగా ఉంటుందని విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. గోదావరి జిల్లా చిన్నయ్యగూడెంలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఏపీలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లె మండలం చిననయ్యగూడెంలో 44.9 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6, బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు, ఏలూరు జిల్లా పెదవేగిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని అయిదు ప్రాంతాల్లో 44 డిగ్రీలు, 13 ప్రాంతాల్లో 43 డిగ్రీలు, 3 ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం 35 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఆదివారం 73 మండలాల్లో ..సోమవారం 12 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

గుంటూరు జిల్లాలో 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపనుందని అంచనా వేసింది. ఇదే సమయంలో వర్షాల పైన సూచనలు చేసింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్స్. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందిన తెలిపింది. జూన్ 4వ తేదీ తరువాత రుతుపవనాల రాక ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో పదో తేదీ తరువాత తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications