ఏపీలో ఈదురు గాలులు, వర్ష బీభత్సం - తాజా హెచ్చరికలు..!!
భానుడి భగభగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వేళ ఈదుగు గాలులు వీచాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగింది. ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ రోజు (సోమవారం) కూడా తీవ్రతతో పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోస్తాలో ఎండతీవ్రత ఉక్కపోత పెరిగింది. రాయలసీమలో వేడిగాలులు వీచాయి.
ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఒక వైపు ఎండల మండిపోతున్నాయి. మరో వైపు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉత్తర దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం మీదుగా వెళుతోంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

మరో వైపు ఎండలు మండిపోతున్నాయి. ప్రకాశం జిల్లా కురిచేడులో 45.5, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 45.2, పల్నాడు జిల్లా రొంపిచర్లలో 44.8, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో 44.7డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 24 మండలాల్లో వేడి గాలులు వీచాయి. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటే.. కానీ ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కోస్తాలో ఎండతీవ్రత ఉక్కపోత పెరిగింది. రాయలసీమలో మాత్రం వేడిగాలులు వీచాయి. ఈ రోజు నుంచి గురువారం వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఉరుములు, మెరుపులతోపాటు అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని.. ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాయలసీమలో వాతావరణం పొడిగా మారడంతో పడమర దిశ నుంచి వేడిగాలులు వీస్తున్నాయి. కోస్తాలో తేమ అధికంగా వుండడంతో ఎండతీవ్రతకు ఉక్కపోత పెరిగింది. తిరుపతిలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడింది. వర్షంతో పాటు పెనుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నగరంలో అక్కడక్కడా వాహనాలపై చెట్లు కూలడంతో ధ్వంసం అయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఉదయం నుంచి ఎండ దెబ్బకు ఇబ్బందిపడిన జనాలు వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.












Click it and Unblock the Notifications