శబరిమల స్వాములకు గుడ్ న్యూస్ - ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలు ఇలా..!!

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని శబరిమల భక్తులు ఏటా పెరుగుతున్నారు. శబరిమల భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నప్పటికీ.. ప్రయాణికుల అవసరాలు తీరడం లేదు. నెలల ముందుగానే అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ బుకింగ్‌ చేసేందుకు సైతం సీట్లు అందుబాటులో ఉండటం లేదు. సరిగ్గా ఆర్టీసీ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టిసారించారు. ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది.

ప్రత్యేక సర్వీసులు : శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక సర్వీసులను నడపనుంది. గతంలో కొన్ని ప్రాంతాల నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని రీజియన్ల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రతీ ఏటా నవంబర్ నుంచి సంక్రాంతి సమయం వరకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాల ధారణ చేసిన భక్తులు శబరిమలకు వెళ్తూ ఉంటారు. ఎక్కవ మంది రైళ్ల ద్వారా చేరుకోనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, డిమాండ్ కు తగిన విధంగా రైళ్లు అందుబాటులో ఉండటం లేదు. భారీగా వెయిటింగ్ లిస్టు కనిపిస్తోందది. దీంతో, కొందరు సొంత వాహనాలతో యాత్రకు సిద్దం అవుతున్నారు. ఇటువంటి వారికి ఆర్టీసీ కొత్త ప్యాకేజీలను ప్రకటించింది.

APSRTC Announces Special buses for Sabarimala From All Regions in the state

ప్యాకేజీల ఖరారు : శబరిమలకు ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఆరు, ఏడు రోజుల చొప్పున ప్యాకేజీలు రూపొందించారు. ప్రత్యేక బస్సులు రీజియన్ల వారీగా ఏర్పాటు చేయనున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్‌లో విశేష అనుభవం కలిగిన డ్రైవర్లను ప్రయాణికులతో పంపుతారు. రీజియన్‌లో అయ్యప్పస్వామి భక్తుల కోరిక మేరకు వివిధరకాల బస్సులను ఏర్పాటు చేస్తారు. అమరావతి, ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌, ఆల్ట్రా డీలక్స్‌ బస్సులను ప్రత్యేక సర్వీసులుగా నడపనున్నారు. బస్సులను బట్టి ప్యాకేజీలు ఉంటాయి. విశాఖ రీజియన్‌ అధికారులు ఇప్పటికే శబరిమల అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలు ప్రకటించినట్లు తెలిసింది. ఐదు రోజులు ప్యాకేజీలో భాగంగా విశాఖలో బయలుదేరి విజయవాడ, మేల్‌ మర ఒత్తూరు, ఎరిమేలి, పంబ, సన్నిధానం చేరుకుంటుంది.

ప్రముఖ క్షేత్రాలతో సహా : తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడ నుంచి విశాఖ చేరుకుంటుంది.ఏడు రోజుల యాత్రలో భాగంగా సూపర్‌ లగ్జరీ టిక్కెట్టు రూ.7000, అల్ట్రా డీలక్స్‌ రూ.6900గా నిర్ణయించారు. ఏడు రోజుల యాత్రలో భాగంగా విశాఖ నుంచి విజయవాడ, కాళహస్తి, బెంగళూరు, మైసూరు, గురువారాయి, ఎరిమేలి, పంబ, సన్నిధానంకు చేరుకుంటు-ంది.

ఇదే క్రమంలో ఇతర రీజియన్ల అధికారులు కూడా అయ్యప్ప స్వాముల కోసం టూర్‌ ప్యాకేజీలు రూపొందిస్తున్నారు. ప్రతి నెలా పౌర్ణమి రోజున తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళుతుంటారు. గతంలో తమిళనాడు సరిహద్దు జిల్లాల నుంచి మాత్రమే భక్తులు వెళ్లగా.. గత రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సంఖ్యలో వెళుతున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకొని ప్రతి రీజియన్‌ నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+