US-Iran War: సడన్ గా యుద్దం ఆపేసిన అమెరికా..! ఇరాన్ కీలక నిర్ణయం..!

పశ్చిమాసియాలో ఉద్రిక్తలు మరోసారి ఉవ్వెత్తున ఎగసిపడి ఉన్నట్లుండి చల్లారిపోయాయి. నిన్న మొన్నటివరకూ అమెరికా వరుస దాడులతో ఇరాన్ (Iran)ను ఉక్కిరిబిక్కిరి చేస్తే.. టెహ్రాన్ కూడా గల్ఫ్ దేశాల్ని టార్గెట్ చేస్తూ ప్రతీకార దాడులు చేపట్టింది. దీంతో మరోసారి పశ్చిమాసియా అగ్నిగోళంగా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ సడన్ గా అమెరికా తమ దాడుల్ని నిలిపేసింది. దీంతో ఇరాన్ కూడా ఆశ్చర్యపోతోంది. అదే సమయంలో గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడుల్ని ఇరాన్ ఆపేసింది.

గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా తన దాడులను తాత్కాలికంగా ఆపివేయడం వల్లే తాము కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. దీంతో ఐదు నెలలుగా సుదీర్ఘంగా సాగుతున్న ఈ సైనిక పోరులో మరోసారి కాస్త విరామం లభించినట్లయింది. గత రెండు రాత్రులుగా అమెరికా ఎటువంటి దాడులకు దిగలేదని ఇరాన్ తెలిపింది. తాము మొదటి నుంచి కేవలం ప్రతిస్పందన వ్యూహాన్నే అమలు చేస్తున్నామని, అందుకే అమెరికా దాడులు ఆపగానే తాము కూడా ప్రతీకార చర్యలను నిలిపివేసినట్లు స్పష్టం చేసింది. అమెరికా మళ్లీ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే తాము తిరిగి దాడులు చేస్తామని టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక చేసింది.

Iran Halts Retaliatory Attacks on Gulf States After US Pauses Military Operations

అయితే హఠాత్తుగా అమెరికా దాడులను నిలిపివేయడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నట్లు రక్షణ నిపుణులు భావిస్తున్నారు. వరుసగా రెండు వారాల పాటు రాత్రి పూట భీకర దాడులు నిర్వహించిన అమెరికా దళాల వద్ద వైమానిక రక్షణకు ఉపయోగించే పేట్రియాట్ వంటి క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం. సరిగ్గా ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్‌లో పర్యటించనుండటంతో, రాయబార చర్చల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా ఈ విరామం ప్రకటించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా.. అటు యెమెన్‌లో మాత్రం హౌతీ రెబెల్స్ హల్ చల్ చేస్తూనే ఉన్నారు. ఇరాన్ మద్దతున్న హౌతీలు సౌదీ అరేబియా సరిహద్దులలోని ఆరామ్‌కో ఆయిల్ ప్లాంట్లపై వరుస క్షిపణి దాడులకు దిగాయి. గల్ఫ్ దేశాలపై పెరిగిన ఈ ముప్పును ఎదుర్కొనేందుకు సౌదీలో మొహరించిన గ్రీక్ రక్షణ దళాలు రెండు బాలిస్టిక్ క్షిపణులు, ఓ డ్రోన్ ను అడ్డుకున్నట్లు గ్రీస్ వాయుసేన వర్గాలు నిర్ధారించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+