అమెరికా బాంబుల వర్షం.. ఇరాన్ ప్రతీకారం: ఎర్రసముద్రంలో కొత్త యుద్ధం షురూ!
అమెరికా సైన్యం వరుసగా 12వ రాత్రి కూడా ఇరాన్‌పై బాంబు దాడులు చేసింది. ఈ దాడులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ విషయంపై ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంత సముద్ర మార్గాల గుండా ప్రయాణించే పౌర నావికులు, వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత తగ్గించడమ ఈ దాడుల లక్ష్యమని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ సైన్యం గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలపై దాడులు ప్రారంభించింది. "ఈ ప్రాంత సముద్ర మార్గాల గుండా ప్రయాణించే పౌర నావికులు, వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత తగ్గించడానికి ఈ దాడులు కొనసాగుతాయి" అని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇరాన్ వంతెనలు, విద్యుత్ ప్లాంట్లను పేల్చేస్తామని హెచ్చరికలు
హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడలపై కాల్పులు జరిపినప్పుడు అమెరికా ఓ వంతెనను లేదా విద్యుత్ ప్లాంట్‌ను ధ్వంసం చేస్తుందని బుధవారం డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన ఓ రోజు తర్వాత ఈ దాడులు జరిగాయి. "ఇకపై ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ హార్ముజ్ జలసంధిలో క్షిపణి, రాకెట్, డ్రోన్ లేదా మరే ఇతర పరికరం లేదా ఆయుధంతో ఓడపై కాల్పులు జరిపినప్పుడల్లా అమెరికా ఓ వంతెనపై లేదా విద్యుత్ ప్లాంటుపై బాంబు దాడి చేసి చేస్తుంది" అని డొనాల్డ్ తన సోషల్ మీడియా వేదిక అయిన 'ట్రూత్ సోషల్'లో రాసుకొచ్చారు.

ప్రపంచ ఇంధన వాణిజ్యంలో 20 శాతాన్ని మోసుకెళ్లే కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో అమెరికా వైమానిక దాడులు జరిగాయి. ఈ జలమార్గం ఇరాన్ దాడుల వల్ల చాలా వరకు దిగ్బంధంలో ఉంది. ఈ జలమార్గం ద్వారా అంతర్జాతీయ నౌకాయానాన్ని పునరుద్ధరించడానికి అమెరికా ప్రయత్నిస్తోంది.
🚨 Breaking: Iran has been given just 2 hours.
— Us Force (@TrumpSpoofPower) July 22, 2026
According to intelligence sources, the US has agreed to attack Iran. Tonight could be Iran's last night.
Following this, the world may witness one of the most dangerous airstrikes ever.
No more warnings. The countdown has begun. pic.twitter.com/6J4XaImGjI
ఇరాన్ ప్రతీకారం
మరోవైపు ఇరాన్ సైన్యం కూడా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించి ప్రతీకారం తీర్చుకుంది. తాము శత్రు డ్రోన్‌లను అడ్డుకుంటున్నామని కువైట్ సైన్యం తెలిపింది. ఎక్స్(ట్విట్టిర్) వేదికగా ఓ పోస్ట్‌లో కువైట్ సైన్యం ఇలా పేర్కొంది, "శత్రు డ్రోన్ ముప్పులకు కువైట్ వాయు రక్షణ వ్యవస్థ ప్రతిస్పందిస్తోంది. ఒకవేళ పలు పేలుళ్ల శబ్దాలు వినిపిస్తే, అది వాయు రక్షణ వ్యవస్థ శత్రు లక్ష్యాలను అడ్డుకోవడం వల్లే జరుగుతుంది." అని వెల్లడించింది.
ఎర్ర సముద్రంలో ఓడలపై హౌతీలు దాడి
ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీలు ఎర్ర సముద్రంలో ఓ కొత్త యుద్ధాన్ని ప్రారంభించారు. రెండు సౌదీ చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని తాము సైనిక చర్యకు దిగినట్లు హౌతీ తిరుగుబాటుదారులు వెల్లడించారు. ఈ నౌకలు తమ సముద్ర దిగ్బంధనాన్ని ఉల్లంఘించాయని హౌతీలు ఆరోపిస్తున్నారు. సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు హౌతీ తిరుగుబాటుదారులు సోమవారం ప్రకటించారు. దీనివల్ల గల్ఫ్ ప్రాంతానికి ఆవల ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగే ప్రమాదం ఏర్పడింది.












Click it and Unblock the Notifications