ప్రయాణీకులకు APSRTC గుడ్ న్యూస్, ఇక నుంచి కొత్తగా..!!
APSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల సౌలభ్యం మేరకు కొత్త నిర్ణయాలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసింది. రెవిన్యూ డివిజన్లు.. మండలాల్లో మార్పులను ఖరారు చేయటంతో.. ఇప్పుడు ఆర్టీసీ సైతం ప్రయాణీకుల కోసం మరో నిర్ణయం వెల్లడించింది. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త ఆదేశాలు వెంటనే అమల్లోకి రానున్నాయి.
ఏపీ ప్రభుత్వం జిల్లాలు.. మండలాల పునర్విభజన చేయటంతో ఆర్టీసీ కూడా డిపోలను కూడా జిల్లాల వారీగా విభజించింది. ఈ మేరకు సంస్థ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. అయితే పోలవరం జిల్లాల్లో ఒక్క డిపో కూడా లేదు. ఇక మార్కాపురం జిల్లా పరిధిలో కనిగిరి, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు డిపోలు వచ్చాయి. మార్పులు, చేర్పులు అన్నీ నిన్నటి (బుధవారం) నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇంతకాలం రంపచోడవరం బస్స్టాండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉండేది. ఇప్పుడు కొత్త జిల్లాగా ఏర్పడిన పోలవరం జిల్లా పరిధిలోకి రానుంది. తాజాగా జరిగిన మార్పులు, చేర్పులతో రాష్ట్రంలో ఒక్క డిపో కూడా లేని జిల్లాగా పోలవరం నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు డిపో ఒక్కటే ఉంది. విజయనగరం జిల్లాలో రెండేసి డిపోల చొప్పున విజయనగరం, ఎస్.కోట, అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం డిపోలు ఉన్నాయి. అత్యధికంగా తిరుపతి జిల్లాలో ఏకంగా 10 డిపోలు ఉన్నాయి. ఆ తర్వాత వైఎస్సార్ కడప, నంద్యాల, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 7 డిపోలు చొప్పున ఉన్నాయి.

బాపట్ల జిల్లాలో బాపట్ల, రేపల్లె, చీరాల డిపోలు ఉండనున్నాయి. అదే విధంగా ప్రకాశం లో ఒంగోలు, అద్దంకి, కందుకూరు ఉంటాయి. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు కొనసాగనున్నాయి. నెల్లూరు జిల్లాలోనెల్లూరు-1, 2, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, రాపూరు, గూడూరు ఉంటాయి. తిరుపతి జిల్లాలోవాకాడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, మంగళం, అలిపిరి, తిరుమల, శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు డిపోలు ఉండనున్నాయి. కాగా, చిత్తూరు జిల్లాలోచిత్తూరు-1, 2, పలమనేరు, కుప్పం కొనసాగుతాయి. అన్నమయ్య జిల్లాలో పీలేరు, మదనపల్లె-1, 2, రాయచోటి, పుంగనూరు ఖరారు చేసారు. వైఎస్సార్ కడప జిల్లాలో కడప, బద్వేల్, మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న జిల్లాల నుంచి వేరొక జిల్లా పరిధిలోకి మారాయి. రాష్ట్రంలో జిల్లాల తాజా మార్పులు, చేర్పులు కారణంగా 9 డిపోలు మారాయి.
-
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం -
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!!











Click it and Unblock the Notifications