ఏపీలో ఉచిత బస్సు వేళ ఆర్టీసీకి ఉద్యోగుల షాక్.. ? ఇక తాడోపేడో..!

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మరో మూడు రోజుల్లో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ పథకం అమలుకు కీలకమైన ఆర్టీసీ ఉద్యోగులు గళం విప్పుతున్నారు. తమ పెండింగ్ సమస్యల పరిష్కరిస్తారా లేక విధులు బహిష్కరించి ఉద్యమాలకు సిద్దపడమంటారా అని సవాల్ విసిరారు.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ఐదేళ్ల క్రితం ప్రభుత్వంలో విలీనం అయిన ఆర్టీసి ఉద్యోగుల సమస్యలు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) తెలిపింది. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఆర్టీసీలో రిటైర్ అయి చనిపోయిన వారికి 2022 నుండి లీవ్ ఎన్ క్యాష్ డబ్బులు ఇంత వరకు చెల్లించలేదని, అలాగే గ్రాట్యూటీ డబ్బులు కూడా 2024 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు చెల్లించక పోవడంతో రిటైర్ అయిన ఆర్టీసి ఉద్యోగులు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించింది.

apsrtc empoyees union warns to protest over pending demands ahead of free bus to women scheme

11వ పీఆర్సీకి కి చెందిన 24 నెలలు బకాయిలు, డిఏ బకాయిలు, రావాల్సిన నాలుగు కొత్త డిఏ లు అన్ని పెండింగులోనే ఉన్నాయిని, అంతేకాకుండా గత ఐదేళ్లుగా పదోన్నతులు కూడా ఇవ్వలేదని తెలిపింది. ఈ సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే ఆర్టీసి ఈయూ రాష్ట్రవ్యాప్తంగా గత నెల 4, 5 తేదీలలో ధర్నాలు నిర్వహించినట్లు గుర్తుచేసింది. మరోవైపు విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్న గవర్నర్ పేట 1, 2 డిపోలకు చెందిన ఆర్టీసి స్దలం లులూ మాల్‌కు ఇస్తుండటంపై అభ్యంతరం తెలిపింది. రూ.400 కోట్లు విలువైన ఆర్టీసి స్థలాలను కేటాయించేలా జీఓ 137 జారీపై ఉద్యమాలు చేస్తున్నట్లు తెలిపింది.

apsrtc empoyees union warns to protest over pending demands ahead of free bus to women scheme

ఇప్పటికే 20 జిల్లాల్లో ఆర్టీసి ఉద్యోగులను భవిష్యత్ లో ఏ ఉద్యమానికి పిలుపు ఇచ్చినా సిద్దంగా ఉండాలని ముఖ్యనాయకుల నుంచే సంకేతాలు ఇచ్చామని తెలిపింది. ఇంకా ఆరు జిల్లాలలో ఈనెల 17 న జిల్లా స్దాయి నాయకుల సమావేశాలతో పాటు ప్రెస్ మీట్లు పెడుతున్నట్లు తెలిపింది. అవి పూర్తయిన వెంటనే ఈనెల 27 తరువాత వినాయకచవితి నాటికి కూడా ఆర్టీసి ఉద్యోగుల ప్రధాన సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెలాఖరులో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి సమావేశంలో వచ్చిన అభిప్రాయాల మేరకు రాష్ట్రస్దాయిలో మిగిలిన సంఘాలతో కలసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+