మహిళలకు ఉచిత బస్సు ఈ రూట్లలో నో ఛాన్స్ - ఇవి ఉంటేనే అనుమతి..!!

ఏపీలో ఉచిత బస్సు పథకం ప్రారంభానికి తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాఖీ సందర్భంగా ఈ నెల 9న పథకం గురించి చంద్రబాబు అధికారిక ప్రకటన చేయనున్నారు. 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గ భేటీలో ఆమోద ముద్ర వేసారు. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం అమలు కానుంది. కాగా, అయిదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. ఇదే సమయంలో ఆర్టీసీ మార్గదర్శకాలు సిద్దం చేసింది.

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి 'స్త్రీ శక్తి' పేరుతో ఈనెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. మహిళలు ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రమంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. మహిళలకు ఈ పథకం అమలు చేస్తున్నా.. ఏపీకి చెందిన వారికే పథకం వర్తిస్తుంది. రాష్ట్రానికి చెందిన మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్లు.. ఆధార్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డును చూపించి.. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే నాన్‌స్టాప్ అంతర్రాష్ట్ర సర్వీసులు, ఇతర కేటగిరీ బస్సులకు, కాంట్రాక్ట్‌ క్యారేజ్‌ సర్వీసులు, చార్టెడ్‌ సర్వీసులు, ప్యాకేజీ టూర్లకు ఇది వర్తించదు.

apsrtc-issues-guide-lines-over-implementation-of-free-bus-for-women

ఏపీలో ఉన్న మొత్తం ఆర్టీసీ బస్సుల్లో 6,700 బస్సుల్లో (74శాతం) మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వానికి నెలకు రూ.162 కోట్లు, ఏడాదికి రూ.1,942 కోట్లు ఖర్చవుతుంది. రాష్ట్రంలో రోజుకు సుమారు 26.95 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఏడాదికి 142 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకుంటారని అంచనా. బస్సుల డిమాండ్‌కు తగినట్లుగా ఈ ఏడాది అదనంగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తాం. వచ్చే రెండేళ్లలో మరో 1,400 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేస్తుంది. కాగా, తిరుమల - తిరుపతి మధ్య నడిచే సప్తగిరి బస్సుల్లో ఈ పథకం అమలు కాదు. ఘాట్ రోడ్డలో తిరిగే బస్సుల్లో పథకం వర్తించదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఏసీ బస్సుల్లో ఈ పథకం వినియోగించే అవకాశం లేదని ఆర్టీసీ యాజమాన్యం తేల్చి చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+