140 కోట్ల భారతీయుల తరఫున చెప్తున్నా..! ట్రంప్ కు మోడీ మెసేజ్..!

భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రంప్‌కు, ఆ దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలతో కూడిన భారత్-అమెరికా సంబంధం ప్రపంచ శ్రేయస్సుకు ఒక శక్తిగా ఆయన అభివర్ణించారు.
"140 కోట్ల మంది భారతీయుల తరపున, మీ చారిత్రాత్మక 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌కు, అమెరికా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను," అని మోదీ మెసేజ్ చేశారు.

Cabinet Reshuffle: కేబినెట్ విస్తరణపై మోడీ తాజా ట్విస్ట్- మారిపోయిన లెక్కలు..!
Cabinet Reshuffle: కేబినెట్ విస్తరణపై మోడీ తాజా ట్విస్ట్- మారిపోయిన లెక్కలు..!

భారత్, అమెరికా మధ్య కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యానికి మించిన బంధం ఉందని, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, తమ ప్రజల అపరిమితమైన సామర్థ్యం పట్ల నిబద్ధత ఈ రెండు దేశాలను ఏకం చేసిందని ప్రధాని మోడీ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, రాబోయే 250 ఏళ్లు అమెరికాకు మరింత శ్రేయస్సు, శాంతి, పురోగతిని తీసుకువస్తాయని, అదే సమయంలో భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

PM Modi Extends Greetings to President Trump US on 250th Independence Anniversary
PM Modi: ఆస్ట్రేలియాకు వస్తే చంపేస్తాం..! మోడీకి వార్నింగ్ ..!
PM Modi: ఆస్ట్రేలియాకు వస్తే చంపేస్తాం..! మోడీకి వార్నింగ్ ..!

తాజాగా ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా మోడీ, ట్రంప్ సమావేశమైన కొన్ని వారాల తర్వాత ప్రధాని ఈ సందేశం పంపారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్-లెస్-బైన్స్‌లో 16 నెలల తర్వాత జరిగిన ఇద్దరి మొదటి సమావేశంలో, ప్రధాని మోదీతో తన సంభాషణ చాలా బాగుంది అంటూ ట్రంప్ అభివర్ణించారు. వాషింగ్టన్- న్యూఢిల్లీల మధ్య వ్యూహాత్మక సహకారం కొనసాగుతుందని కూడా సంకేతం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+