విజయ్ వల్ల కొడుకు సంజయ్ కు బిగ్ షాక్..!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన నటనతో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత టీవీకే పార్టీ పెట్టి పోటీ చేసిన తొలిసారే ఏకంగా సీఎం పీఠాన్ని అధిరోహించారు. తమిళనాడు సీఎంగా తనదైన మార్క్ పరిపాలన సాగిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తున్నారు. ఇక విజయ్ ఫ్యామిలీ విషయం తెలిసిందే. ఆమె భార్య సంగీత సోర్లలింగం కాగా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జాసన్ సంజయ్, దివ్య సాషా .. ఇక విజయ్ తో విడాకుల ప్రక్రియ నడుస్తున్న నేపథ్యంలో అతనికి దూరంగా సంగీత, పిల్లలు ఉంటున్నారు.

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ అతని భార్యా పిల్లలు కనిపించలేదు. ఇక తమిళనాడు ఎన్నికల సమయంలో విజయ్ కు షాక్ ఇస్తూ అతని కుమారుడు జాసన్ సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. జాసన్ సంజయ్ తన తండ్రి ఇంటి పేరు తొలగించుకున్నట్లు తేలింది. ప్రస్తుతం విజయ్ సీఎం బాధ్యతల్లో బిజీగా ఉండగా.. అతని ఫ్యామిలీ దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

అయితే విజయ్ వల్ల జాసన్ సంజయ్ కు బిగ్ షాక్ తగిలింది. అయితే అది ఇప్పుడు కాదు.. జాసన్ సంజయ్ 5వ తరగతిలో ఉన్నప్పుడు.. అప్పుడు ఏం జరిగిందంటే..? జాసన్ సంజయ్ 5వ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ ముగియగానే తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి వచ్చి అతడ్ని టక్కున కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. విజయ్ ఫ్యాన్ అయిన ఆ వ్యక్తి తన అభిమాన హీరోనూ దగ్గరినుంచి చూసే అవకాశం కోసం అలా చేసినట్లు తేలింది. అయితే ఇదంతా చూసిన జాసన్ సంజయ్ తాను నిజంగానే కిడ్నాప్ కు గురైనట్లు భావించాడట..

JasonSanjay Reveals Shocking Claim A Fan of My Dad Tried to Kidnap Me Jason Sanjay kidnapping

ఈ విషయాన్ని స్వయంగా జాసన్ సంజయ్ ఇటీవల చెప్పడం విశేషం. అయితే సంజయ్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పారో తెలుసా..? అప్పట్లో అతడ్ని కిడ్నాప్ చేసిన అభిమాని కుమారుడికే.. ఆ అభిమాని ఎవరో కాదు.. తమిళ నటుడు జెమిని మణి.. ప్రస్తుతం జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిగ్మా అనే చిత్రంలో జెమిని మణి కీలక పాత్ర చేస్తున్నాడు. అయితే ఈ మూవీ సెట్ కు జెమిని మణి కుమారుడు రావడంతో అప్పటి విషయాన్ని సరదాగా ఆ బాలుడికి చెప్పారు జాసన్ సంజయ్.. ఇక ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+