PM Modi: ఆస్ట్రేలియాకు వస్తే చంపేస్తాం..! మోడీకి వార్నింగ్ ..!
ప్రధాని మోడీ (PM Modi) ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకూ ఆస్ట్రేలియా (Australia) పర్యటనకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా ఆయన రాజధాని మెల్ బోర్న్ లో ఓ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో మోడీని ఆస్ట్రేలియాకు వస్తే చంపేస్తామంటూ ఇవాళ హెచ్చరికలు వచ్చాయి. ఆస్ట్రేలియా నుంచి అందిన ఈ హెచ్చరికలపై కేంద్రం అప్రమత్తమైంది. వెంటనే ఆస్ట్రేలియా పోలీసుల్ని అలర్ట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన అక్కడి పోలీసులు.. నిందితుడి ఐపీ అడ్రస్ ను గుర్తించారు.
ప్రధాని మోడీ పర్యటనకు ముందు ఆయన్ను టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్‌లో చంపేస్తామన్న బెదిరింపు రావడంతో ఆస్ట్రేలియా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. జూలై 8 నుండి 10 మధ్య ప్రధాని మోదీ మెల్బోర్న్‌ను సందర్శించనున్నారు. అక్కడ ఆయన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. "మెల్బోర్న్ మీట్స్ మోదీ" (Melbourne Meets Modi) అనే సామాజిక కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ పెట్టిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్ కామెంట్స్ విభాగంలో మోడీని ఓ యూజర్ ఇలా బెదిరిస్తూ మెసేజ్ పెట్టాడు.

ఆ ఫేస్‌బుక్ పోస్ట్‌కు సంబంధించిన ఐపీ అడ్రస్‌ను అధికారులు గుర్తించారని ఆస్టేలియా టుడే తెలిపింది. అలాగే ఈ బెదిరింపునకు సంబంధించిన పరిస్థితులను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అది నేరపూరిత చర్య అవునా కాదా అని అంచనా వేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ (AFP) ఎటువంటి అరెస్టులనూ ధృవీకరించలేదు. అలాగే తదుపరి వివరాలను కూడా వెల్లడించలేదు. అయినా ఆస్ట్రేలియా అధికారులు ప్రధాని మోడీకి చేసిన ఈ బెదిరింపును అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారని తెలుస్తోంది.














Click it and Unblock the Notifications