Vaibhav Sooryavanshi: ఎట్టకేలకు బుడ్డోడి అరంగేట్రం-సచిన్ రికార్డు బద్దలు..!
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో వైభవ్ ను ఓపెనర్ గా తీసుకున్నారు. ఫామ్ లో లేని వికెట్ కీపర్ సంజూ శాంసన్ స్ధానంలో వైభవ్ కు ఇవాళ అవకాశం కల్పించారు. దీంతో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ.. అతి పిన్న వయస్సుల్లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ రికార్డును తుడిచిపెట్టాడు.
15 ఏళ్ల 3 నెలల 7 రోజుల వయసులో వైభవ్ సూర్యవంశీ ఇవాళ భారత క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ లో తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ బీహార్‌లోని సమస్తిపూర్ కుర్రాడు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో తన అరంగేట్రం క్యాప్‌ను అందుకున్నాడు. కోచ్ గంభీర్ స్ఫూర్తిదాయక ప్రసంగం తర్వాత తిలక్ వర్మ చేతుల మీదుగా వైభవ్ తన తొలి భారత జట్టు క్యాప్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత సహచర ఆటగాళ్లు అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకోవడం హృదయపూర్వక దృశ్యంగా నిలిచింది. అయితే మ్యాచ్ లో 10 బంతుల్లో 2 సిక్స్ ల సాయంతో 14 పరుగులే చేసి స్టంప్ అవుట్ గా వైభవ్ వెనుదిరిగాడు.

శ్రేయాస్ అయ్యర్ కూడా అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు గత కొన్ని నెలలుగా అతను బ్యాటింగ్ చేస్తున్న తీరును మీరు చూసే ఉంటారు. అతను జట్టులో ఉండటానికి పూర్తిగా అర్హుడని నా అభిప్రాయం. అతను ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా, దృఢమైన స్వభావంతో ఉంటాడు. రాబోయే మ్యాచ్‌లలో ఎలాంటి సవాళ్లు ఉంటాయో అతనికి బాగా తెలుసు. నెట్స్‌లో అతను బ్యాటింగ్ చేసే విధానం మరియు బౌలర్లను ఎదుర్కొనే తీరు అతను ఎలాంటి ఆటగాడో తెలియజేస్తాయన్నాడు. మరోవైపు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో టీమ్ ఇండియా తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు వైభవ్ దాన్ని చెరిపేశాడు.














Click it and Unblock the Notifications