ఆర్టీసీ ముందుస్తు రిజర్వేషన్: ప్రయాణికులకు లాభం కంటే నష్టమే ఎక్కువే
విజయవాడ: టిక్కెట్ల రిజర్వేషన్‌లో ఏపీయస్ఆర్టీసీ కొత్త విధానానికి తెరదీయనుంది. ఈ కొత్త విధానం వల్ల ముందుగా టికెట్ రిజర్వేషన్ చేయించుకునే వారు లాభపడనున్నారు. ప్రయాణ సమయానికి కనీసం వారంరోజులు, అంతకంటే ముందుగా టికెట్ తీసుకుంటే బస్ ఛార్జీ 5 నుంచి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.
ఆలస్యం చేస్తే మాత్రం మీ జేబుకి చిల్లు పడనుంది. ఈ మేరకు బస్ ఛార్జీల విషయంలో కొత్తగా మార్పులు చేయనున్నారు. అంతేకాదు ఫిక్స్‌డ్ ఛార్జీల విధానానికి స్వస్తి చెప్పనున్నారు. ఇకపై రద్దీగా ఉండే రోజుల్లో ఛార్జీలు పెంచడం, రద్దీ తక్కువగా ఉండే రోజుల్లో (డైనమిక్ ఫేర్) తగ్గించాలంటూ ఆర్టీసీ నిర్ణయించింది.

అయితే ఇక్కడ ఓ కండిషన్ ఉంది. ఆన్ లైన్ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సుల్లోనే ఈ కొత్త విధానాన్ని ఏప్రిల్ నుంచి వర్తింపజేయనున్నారు. ప్రయాణికుడి ప్రయాణ తేదీ, టికెట్ బుకింగ్ చేసే తేదీని బట్టి ఛార్జీలు ఎంతమేరకు నిర్ణయించాలన్న దానిపై ఏపీయస్ఆర్టీసీ ఇప్పటికే ఓ సాప్ట్‌వేర్‌ను రూపొందించింది.
ప్రయాణ సమయం ఆరు రోజుల ముందు నుంచీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. బస్సులో సీట్లు అయిపోయేకొద్ది, ప్రయాణ సమయం దగ్గరపడుతున్నకొద్ది సాధారణ ఛార్జీల కంటే కనీసం 5 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. బస్సుల్లో రద్దీ లేకుంటే, సీట్లు ఖాళీగా ఉంటే సాధారణ ఛార్జీలే ఉంటాయి.
ప్రతిరోజూ 603 సర్వీసులకు గాను 22,752 సీట్లు 'డైనమిక్ ఫేర్' కింద అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీయస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విమానయాన సంస్ధలు, రైల్వే శాఖ ఈ డైనమిక్ ఫేర్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీయస్ఆర్టీసీ కూడా ఈ తోవలోకి వస్తోంది.
దీంతో పాటు రివర్స్ బిడ్డింగ్ చేసేందుకు కూడా అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఉదాహరణకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రూ.370 బస్‌టికెట్ ఉందని అనుకుంటే.. ప్రయాణికుడు మొబైల్‌ఫోన్‌లో యాప్ ద్వారా రూ.230 కోట్ చేయవచ్చు.

సీట్లు చాలా ఖాళీగా ఉండి, ఆ సమయంలో ఎక్కేవారు ఉండకపోతే టికెట్‌ను రూ.320కి లేదంటే, రూ.310కి ఇస్తానని ఆర్టీసీ ముందుకురావొచ్చు. లేదంటే రూ.370 ఛార్జిలో మార్పులు ఉండకపోవచ్చు. అదేవిధంగా డిమాండ్ ఉంటే ఛార్జీ పెంచేసి రూ.430 వరకూ పెంచుకుంటూ వెళ్లే అవకాశమూ ఉంది.
ఆర్టీసీ ప్రవేశపెట్టనున్న ఈ డైనమిక్ ఫేర్ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తామని ఎండీ నండూరి సాంబశివరావు తెలిపారు. ఏది అయితేనేం ఈ కొత్త విధానం వల్ల ప్రయాణికులు జేబులకు చిల్లు పడనుంది. ఇటీవలే ఛార్జీలను పెంచిన ఆర్టీసీ, కొత్త విధానం ద్వారా ప్రయాణికులు తెలియకుండా భారీ ఎత్తున లాభపడాలనే ఆలోచనలో ఉంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications