ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి కర్ణాటకకు సర్వీసులు.. ఆన్ లైన్ లో టికెట్స్..

లాక్ డౌన్ సడలింపులతో దాదాపు సాధారణ స్థితికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 253 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6152కు పెరిగింది. మరణాల సంఖ్య 84కు చేరింది. గత వారం రోజులుగా కొత్త కేసుల ఉధృతి పెరగడంతో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారంటూ పెద్ద ఎత్తున చర్చజరిగింది. వాటిని పుకార్లుగా కొట్టిపారేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 17 నుంచి కర్ణాటకకు..

17 నుంచి కర్ణాటకకు..

నాలుగో దశ లాక్ డౌన్ ముగిసే నాటికే ఏపీలో బస్సులు తిరుగుతున్నా.. అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతి లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 17 నుంచి కర్ణాటకకు బస్సులు తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థ యాజమాన్యం అదివారం ఒక ప్రకటన చేసింది.

దశలవారీగా పెంపు..

దశలవారీగా పెంపు..

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని.. తొలుత పరిమిత సంఖ్యలో మాత్రమే కర్ణాటకకు సర్వీసులు నడుపుతామని, దశలవారీగా వాటిని విస్తరిస్తామని అధికారులు తెలిపారు. తొలిదశలో 168 బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని, 4 దశల్లో వాటి సంఖ్యను 500కు పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

 సోమవారం నుంచి టికెట్లు..

సోమవారం నుంచి టికెట్లు..

ఈనెల 17 నుంచి కర్ణాటకకు వెళ్లే బస్సుల్లో టికెట్లకు సంబంధించి సోమవారం(ఈనెల 15) నుంచే ఆన్‌లైన్‌ రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులు https://www.apsrtconline.in ద్వారా రిజర్వేషన్‌ చేసుకోవాలని సూచించింది. కాగా, అన్ని బస్సుల్లో సోషల్ డిస్టెన్సింగ్ నియమాలను తప్పనిసరిగా ఫాలో కావాల్సి ఉంటుందని, ప్రయాణికులు మాస్కులు ధరించడం తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Recommended Video

    APSRTC In Tough Situation,Neighbour States Not Intrested To Allow AP Buses
     రెండు వైపులా టెస్టులు..

    రెండు వైపులా టెస్టులు..

    బుధవారం నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పున:ప్రారంభం కానుండటంతో ఏపీఎస్ఆర్టీసీ ఆమేరకు భారీ ఏర్పాట్లు చేసుకుంది. అన్ని సర్వీసులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ, క్రిమిసంహారక మందులను స్ప్రే చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, ఇటు నుంచి కర్ణాటకకు వెళ్లే ప్రయాణికుల్ని, తిరుగు ప్రయాణంలో కర్ణాటక నుంచి వచ్చేవాళ్లకు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+