లడ్డూ వివాదం, తిరుమలకు భోలేబాబా డెయిరీ నెయ్యి సరఫరా...!!
తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించారనే వివాదం ఊహించని మలుపు తిరుగుతుంది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసే డెయిరీ మరో డైరీ నుండి నెయ్యి తెప్పించిందని, ఆ డెయిరీ మరో రాష్ట్రం నుండి నెయ్యిని పంపించిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ సంస్థ తిరుమలకు నెయ్యి సరఫరా చేయడానికి అప్పటి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.
అయితే తమిళనాడులోని దిండిగల్ లోని ఏఆర్ డెయిరీ సంస్థలో తయారు చేసిన నెయ్యి నేరుగా తిరుమలకు సరఫరా కాలేదని అధికారుల విచారణలో వెలుగు చూసింది. తిరుపతి జిల్లాలోని పునబాక వద్ద ఉన్న శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ నుండి నెయ్యి తమిళనాడులోని దిండిగల్ లోని ఏఆర్ డెయిరీకి సరఫరా అయ్యిందని ఆంధ్రప్రదేశ్ లోని జీఎస్టీ అధికారులు అంటున్నారు. అయితే వైష్ణవి డెయిరీ నుండి వచ్చిన నెయ్యిని మా సంస్థలో తయారు చేశామని చెబుతున్న ఏఆర్ డెయిరీ నిర్వహకులు ఆ నెయ్యిని మళ్లీ తిరుమలకు పంపించిందని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

ఈ రెండు డైరీల మధ్య లావాదేవీల వ్యవహారం చూస్తే అసలు బంగారం బయటకు వచ్చిందని అధికారులు అంటున్నారు. తిరుపతికి సుమారు రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరాఖండ్లోని బోలేబాబా డెయిరీ నుండి శ్రీ వైష్ణవి సంస్థ నెయ్యిని కొనుగోలు చేసిందని అధికారులు అంటున్నారు. భోలేబాబా డెయిరీ సంస్థ నుండి శ్రీ వైష్ణవి డెయిరీ నెయ్యిని కొనుగోలు చేసి ఆ నెయ్యిని తర్వాత తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి పంపించిందని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
చివరికి ఏఆర్ డెయిరీ నుంచి ఆ నెయ్యి తిరుమల చేరుతోందని అధికారులు అంటున్నారు. భలేబాబా సంస్థ నుండి రూ. 355 రూపాయలకు తిరుపతిలోని వైష్ణవి డెయిరీ కొనుగోలు చేసింది. శ్రీ వైష్ణవి సంస్థ ఆ నెయ్యిని రూ. 318.57కి ఏఆర్ డెయిరీకి సరఫరా చేసింది. ఆ నెయ్యిని ఏఆర్ డెయిరీ రూ. 319.80 రూపాయలకి తిరుమలకు సరఫరా చేసిందని అధికారులు అంటున్నారు. తిరుపతిలోని శ్రీ వైష్ణవి సమస్త ప్రతి కిలో నెయ్యికి 36.43 రూపాయల నష్టాన్ని భరిస్తూ సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని దిండిగల్ లో ఉన్న ఏఆర్ డెయిరీకి ఆ నెయ్యి సరఫరా చేసిందని అధికారులు అంటున్నారు.
కేవలం 1.23 రూపాయల లాభం పెట్టుకొని ఆ నెయ్యిని ఏఆర్ డెయిరీ మళ్లీ తిరుమలకు పంపించిందని అధికారులు అంటున్నారు. తమిళనాడు నుండి తిరుమలకు వచ్చే మార్గంలోనే అన్ని టోల్ గేట్లలో శ్రీవైష్ణవి, ఏఆర్ డెయిరీ సంస్థలకు చెందిన నెయ్యి ట్యాంకర్లు ఎప్పుడెప్పుడు సంచరించాయి అని అధికారులు ఆరా తీశారు. శ్రీ వైష్ణవి డెయిరీ సంస్థ నుండి ఏఆర్ డెయిరీ సంస్థకు వెళ్లిన నెయ్యి ట్యాంకర్లు ఎప్పుడెప్పుడు సంచరించాయని అధికారులు పూర్తి సమాచారం బయటకు లాగారు.

శ్రీ వైష్ణవి డెయిరీ నుండి ఏఆర్ డెయిరీకి వెళ్లిన నెయ్యి ట్యాంకర్లు కొన్ని తిరిగి ఎక్కడి నుండి తిరుమలకు వెళ్లాయని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. దేశంలోనే కల్తీ నెయ్యి తయారు చేయడంలో నెంబర్ వన్ అయిన భోలేబాబా డెయిరీ నుంచి తిరుపతిలోని శ్రీ వైష్ణవి సంస్థ నెయ్యిని కొనుగోలు చేసిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. బోలేబాబా డెయిరీ డైరెక్టర్లుగా ఉన్న పొమిల్ జైన్, విపుల్ జైన్ లు శ్రీ వైష్ణవి సంస్థ లో డైరెక్టర్లుగా పని చేస్తున్నారని అధికారులు అంటున్నారు.
ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రలలో సుమారు 3,300 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత నెయ్యిని తిరుమలకు పంపించాల్సిన అవసరం ఏముందని, అంత తక్కువ ధరకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరకదని అధికారులు అంటున్నారు. తమిళనాడులోని దుండిగల్ లో ఉన్న ఏఆర్ డెయిరీ సంస్థ తిరుమలకు పదిలక్షల కిలోల నెయ్యి సరఫరా చేయడానికి అప్పటి టీటీడీ పాలకమండలిలోని కొందరు పెద్దలు సహకరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక సిట్ దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని శ్రీవారి భక్తులు అంటున్నారు. అయితే బోలేబాబా డెయిరీలో నెయ్యి కల్తీ అయ్యిందా ?, శ్రీవైష్ణవి డెయిరీలో నెయ్యి కల్తీ అయ్యిందా ?, ఏఆర్ డెయిరీలో నెయ్యి కల్తీ అయ్యిందా ? అనే విషయం తెలియడం లేదని అధికారులు అంటున్నారు. నెయ్యి ఎక్కడ కల్తీ అయ్యింది ? అని అధికారుల విచారణలో వెలుగు చూడనుంది.
-
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది












Click it and Unblock the Notifications