బేరసారాల కోసమే కెసిఆర్ భారీర్యాలీ: విలీనంపై అరవింద్

తెలంగాణ వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కెసిఆర్... ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దకు ఒక్క దళితుడిని తీసుకు వెళ్లలేదని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసు పార్టీలో కెసిఆర్ తన పార్టీని బేషరతుగా విలీనం చేయాలన్నారు. తెరాస పుట్టిందే తెలంగాణ కోసమని, ఆ కల నెరవేరిందన్నారు.
ఏ ఆలోచన లేకుండా, ఎలాంటి చర్యలు లేకుండానే విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మాట తప్పి విలీనం చేయకుంటే ప్రజలు ఆయనను నమ్మరన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యులతో వెళ్లి సోనియాతో ఫోటో దిగారని విమర్శించారు. తన తెరాస మిత్రులు కెసిఆర్‌ను నమ్మి మోసపోవద్దన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసు పార్టీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. బేరసారాల కోసమే భారీ ర్యాలీని తీశారన్నారు. తన కుటుంబానికి మేలు జరగాలని కెసిఆర్ ఈశిస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెసుదే పై చేయి అని, పదిహేడు లోకసభ స్థానాల్లో గెలిచి కాంగ్రెసు రుణం తీర్చుకోవాలన్నారు.
కాంగ్రెసుదే అధికారం: దానం
కాంగ్రెసు పార్టీలో తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం అయినా కాకున్నా, పొత్తు పెట్టుకున్నా లేకున్నా తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి దానం నాగేందర్ వేరుగా అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications