10దాకా ఆగండి, చెప్తా: అరవింద్, కెసిఆర్‌కు అల్టిమేటం

ఆయన శనివారం ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను ఒంటరిని కాదన్నారు. ఈ నెల 10 తర్వాత అన్నీ చెబుతానని, అయినా తాను ఒక్కడినే మీడియా ముందుకొచ్చి మాట్లాడితే ఏం మజా ఉంటుందని, అప్పుడు మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి వస్తానని చెప్పారు.
అందరం కలిసి మాట్లాడితే ఇంకా మజా ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు విలీనంపై తన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. లేదంటే తనతో పాటు పలువురు కాంగ్రెసులోకి వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణ ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పక పోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ సెంటిమెంటుతో గెలిచిన బొగ్గు కార్మిక సంఘం కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు.
మరోవైపు అరవింద్ రెడ్డి విషయంలో తొందరపడి ప్రకటనలు చేయొద్దని కెసిఆర్ పార్టీ నేతలకు సూచించారట. శనివారం కెసిఆర్‌తో కెక, కడియం తదితరులు సమావేశమయ్యారు. ఈ భేటీలో అరవింద్ రెడ్డి అంశం చర్చకు వచ్చింది. ఆయన కాంగ్రెసు పెద్దలను ఎందుకు కలిశారో ఆరా తీసిన కెసిఆర్ అసహనం వ్యక్తం చేశారట. అయితే, ఇప్పుడే ఏం మాట్లాడవద్దని సూచించారట.












Click it and Unblock the Notifications