Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుప్రీంలో చంద్రబాబు కేసు విచారణ, న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు - ఏం జరిగింది..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై సుదీర్ఘ విచారణ సాగింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించిన 17 ఏ అంశాన్ని మరోసారి కోర్టు ముందు ప్రస్తావించారు. చంద్రబాబు న్యాయవాది హరీష్ సాల్వే తన వాదనలు కోర్టు ముందు ఉంచారు. రేపు ఉదయం ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించనున్నారు. ఈ రోజు జరిగిన వాదనల్లో న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 17ఏ ఆధారంగానే పూర్తి వాదనలు కొనసాయి.

17ఏ పైనే ప్రధానంగా
హరీష్ సాల్వే తన వాదనల్లో ఇది రాజకీయ కక్ష్య సాధింపుగా పేర్కొన్నారు. పబ్లిక్ సర్వెంట్ ను ఎఫ్ ఐ ఆర్ లో చేర్చాలి అంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని వాదించారు. దీనిపై కేంద్రం SOP కూడా జారీ చేసిందని చెప్పుకొచ్చారు. కొన్ని హైకోర్టులు 17ఎ నేరం జరిగిన తేదీని అనుసరించాలని అభిప్రాయాన్ని తీసుకున్నారని గుర్తు చేసారు. మరికొన్ని హెచ్‌సిలు 17ఎ తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ తేదీని అనుసరించాలని అభిప్రాయపడ్డాయని వివరించారు. చంద్రబాబు కేసులో ఫిర్యాదు సెప్టెంబరు 7 2021న దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఆ ఫిర్యాదుతోనే విచారణ మొదలయిందని చెప్పారు, 17a కచ్చితంగా చంద్రబాబుకు ఈ కేసులో వర్తిస్తుందని వాదించారు. గుజరాత్ లో సిమెన్స్ ప్రాజెక్ట్ స్టడీ చేశాకే, చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ మొదలు పెట్టారని వివరించారు.

Argumenrs in chanra Babu quash petition in supreme court will continue tomorrow

రేపు రోహిత్గీ వాదనలు
17 ఏ ప్రకారం అరెస్ట్ కు ఖచ్చితంగా గవర్నర్ అనుమతి కావాలని వాదనలు వినిపించారు. సీఐడీ తరపున ముకుల్‌ రోహత్గీ, నిరంజన్ రెడ్డి వాదనలు కొనసాగించారు.ఈ కేసులో తొలుత వచ్చిన ఫిర్యాదు..జీఎస్టీ చెల్లింపుల్లో ఫిర్యాదుల అంశం పైన ప్రస్తావనకు వచ్చింది. డిజైన్ టెక్ తో ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం పైన సాల్వే వివరించారు. కేసు విచారణ ప్రారంభం.. ఫిర్యాదుపైనా న్యాయమూర్తి ఆరా తీసారు. 2021 లో ఈ కేసు విచారణ ఎఫ్ఐఆర్ దాఖలు కావటంతో..17 ఏ వర్తిస్తుందని వాదించారు.ఇదే సమయంలో చంద్రబాబు రిమాండ్ రిపోర్టును తాము ఛాలెంజ్ చేస్తుననట్లు సాల్వే కోర్టుకు స్పష్టం చేసారు. రిమండ్ రిపోర్టును హైకోర్టులో ఛాలెంజ్ చేయగా అక్కడ కొట్టేసారని..ఇప్పుడు సుప్రీంకు రావాల్సి వచ్చిందని వివరించారు.

కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
న్యాయమూర్తి బేలా త్రివేది కీలక వ్యాఖ్యలు చేసారు. 17-A అనేది అవినీతి నిరోధానికి ఉండాలే గానీ, కాపాడేందుకు కాదని పేర్కొన్నారు. ఇదే కదా చట్టం అసలు ఉద్దేశం అని వ్యాఖ్యానించారు. 17-A లో చాలా అంశాలున్నాయన్నారు. 17-A కు ముందు జరిగిన నేరాలకు ఇది వర్తిస్తుందా అని ప్రశ్నించారు. 17-A ప్రకారం అనుమతి తీసుకోకపోతే జరిగిన దర్యాప్తు ఏం కావాలని సాల్వేను ప్రశ్నించారు. ఇక, సాల్వే సుదీర్ఘ వాదనల తరువాతర రోహిత్గీ వాదనల గురించి కోర్టు ప్రశ్నించింది. రేపు (మంగళవారం) తన వాదనలు వినిపిస్తానని రోహిత్గీ చెప్పుకొచ్చారు. దీంతో, మంగళవారానికి కోర్టు విచారణ కొనసాగించాలని నిర్ణయిస్తూ వాయిదా వేసింది. అటు హైకోర్టే..ఇటు ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పులు రావటంతో..సుప్రీంలో ఏం జరుగుతందనేది ఉత్కంఠ పెంచుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+