Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సెక్సీ ఫోటోలతో పాక్ గర్ల్ ట్రాప్ ఇష్యూ: స్పందించిన ఆర్మీ

హైదరాబాద్: పాకిస్తాన్‌కు చెందిన యువతి అనుష్క అగర్వాల్ పేరుతో సుబేదార్ పతన్ కుమార్ పొద్దార్ నుండి సమాచారం తీసుకున్న విషయం పైన ఆర్మీ గురువారం స్పందించింది. ఈ వ్యవహారంపై తాజాగా ఆర్మీ స్పందిస్తూ.. ఈఎంఈ యూనిట్‌తో పతన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

సికింద్రాబాద్ ఈఎంఈ యూనిట్ సమాచారం అంతా భద్రంగా ఉందని స్పష్టం చేసింది. సమాచారమేదీ బయటకు పొక్కలేదని ఆర్మీ పేర్కొంది. పతన్ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

Army respond on Subedar Patan Kumar Poddar's arrest

కాగా, పాకిస్తాన్‌కు చెందిన యువతిగా భావిస్తున్న ఓ యువత అనుష్క అగర్వాల్ పేరుతో సామాజిక వెబ్‌సైట్లలో పతన్‌తో పరిచయం పెంచుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య క్రమంగా సాన్నిహిత్యం పెరిగింది. తాను రీసెర్చ్ స్కాలర్‌నని చెప్పి నమ్మబలికింది.

అంతేకాదు, తన మెయిల్ ఐడీ ద్వారా తన నగ్న చిత్రాలను పంపించింది. స్నానం చేసే దృశ్యాలను వీడియో ద్వారా పంపించింది. దీంతో పతన్ కుమార్ ఆమె కోరిన వివరాలు, సైన్యానికి చెందిన చిత్రపటాలను పంపించినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్మీ స్పందించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+