కొలువు కోసం పరుగు, సాగర తీరంలో 2కే రన్ (ఫోటోలు)
విశాఖపట్నం: నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో నిరుద్యోగ యవకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.
సోమవారం శ్రీకాకుళం జిల్లా టెక్కిలి సబ్ డివిజన్‌కు చెందిన 4,749 మంది ఇందిరా ప్రియదర్శిన మైదానానికి చేరుకోగా ఉదయం 4 గంటల నుంచి జరిగిన పరిశీలనలో నిర్ణీత శరీరీ ఎత్తు కలిగిన 3,991 మందికి పరుగు పోటీలకు అవకాశం కల్పించారు.

కొలువు కోసం పరుగు
6 గంటలకు ప్రారంభించిన పరుగు పోటీలో 410 మంది అభ్యర్ధులు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. మైదానంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, దానికి తోడు అభ్యర్ధులు తెల్లవారు జాము నుంచి ఎలాంటి ఆహారం తీసుకోక పోవడంతో పలువురు అస్వస్ధకు గురయ్యారు.

కొలువు కోసం పరుగు
వారిని సమీపంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి తరలించి చికిత్స అందించారు. మొత్తం మీద సోమవారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నియామక కార్యక్రమం జరిగింది.

కొలువు కోసం పరుగు
ఇక పోర్టు కళావాణి స్టేడియంలో సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ 1676, సోల్జర్ జనరల్ డ్యూటీ 2195, సోల్జర్ టెక్నికల్ 1683, సోల్జర్ ట్రేడ్ మెన్ 1223 మందికి టోకెన్లు జారీ చేసి వీరందరికి మంగళవారం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు.
కొలువు కోసం పరుగు
ఇక రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారులు చెప్పే మాయమాటలు ఎట్టి పరిస్ధితుల్లో నమ్మవద్దని ఆర్మీ లెఫ్ట్ నెంట్ జరనల్ ఆర్ఎన్ నాయర్ అభ్యర్ధలకు సూచించారు.

కొలువు కోసం పరుగు
ఈ ర్యాలీలో సుమారు 2 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఎంపికలు జరుగుతున్నాయని, ఎలాంటి కష్టం లేకుండానే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే మాటలు మోసపూరితమైనవని చెప్పారు.

సాగర తీరంలో 2కే రన్
డిజిటల్ వారోత్సవాల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సాగరతీరంలో కాళిమాత ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల పరుగును మంత్రి గంటా ప్రారంభించారు.

సాగర తీరంలో 2కే రన్
పాఠశాల విద్యార్ధులకు కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో కంప్యూటర్ ప్రాజెక్టు మంజూరైన పాఠశాలల్లో తరిగి పునరుద్ధరిస్తామన్నారు.












Click it and Unblock the Notifications