తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు, ప్రత్యేక దర్శనాలు రద్దు, బైక్ లు బ్యాన్ ఈవో రెడ్డి !

తిరుమల/తిరుపతి: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో (Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15వ తేదీ నుంచి ఈనెల 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ (TTD) ఈవో ఏవీ. ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని (Tirumala)అన్నమయ్య భవన్‌లో జిల్లా కలెక్టర్‌ వెంకట్రమణారెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డితో కలిసి ఈవో ఏవీ ధర్మారెడ్డి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడీలోని (TTD)అన్ని విభాగాలు సమన్వయంతో శ్రీవారి భక్తులకు (devotees) ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. అక్టోబరు 19వ తేదీన గరుడసేవ, 20వ తేదీన పుష్పక విమానం, 22వ తేదీన స్వర్ణరథం, అక్టోబర్ 23వ తేదీన చక్రస్నానం నిర్వహించనున్నట్లు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

Arranging grand Srivari Navratri Brahmotsavam in Tirumala, TTD EO Dharma Reddy

తిరుమల (Tirumala)నవరాత్రి బ్రహ్మోత్సవాలలో వయోవృద్ధులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అక్టోబర్ 19వ తేదీన గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను తిరుమల (Tirumala) ఘాట్ రోడ్డు మార్గంలో అనుమతించరని, తిరుమలకు వచ్చే భక్తులు (devotees) ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని టీటీడీ (TTD)ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు.

గరుడసేవనాడు గరుడ వాహనాన్ని వీక్షించేందుకు ముందు రోజు రాత్రి నుండే అసంఖ్యాకంగా భక్తులు (devotees) తిరుమలలోని (Tirumala) గ్యాలరీలలో వేచి ఉంటారని టీటీడీ (TTD)ఈవో ధర్మారెడ్డి అన్నారు. కావున భక్తుల సౌకర్యార్థం గరుడ వాహనాన్ని ముందుగా ప్రారంభించేందుకు సాధ్య సాధ్యాలను అర్చకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నామని టీటీడీ (TTD)ఈవో ధర్మారెడ్డి మీడియాకు చెప్పారు.

Arranging grand Srivari Navratri Brahmotsavam in Tirumala, TTD EO Dharma Reddy

అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో (Tirumala)జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తులకు (devotees) ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించడానికి టీటీడీతో (TTD)సమన్వయం చేసుకొని అన్ని ప్రభుత్వ విభాగాలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

అంతకుముందు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి విభాగాల వారీగా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో టీటీడీ (TTD) జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, టీటీడీ, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+