శుభవార్త: 90 శాతం నిధులిచ్చేందుకు కేంద్రం ఒకే, ప్రత్యేక హోదాపై చర్చ: హరిబాబు
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా 90 శాతం నిధులను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ హమీ ఇచ్చారని బిజెపి ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రకటించారు.ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా, అదే ఆర్థిక ప్రయోజనాలను అందిస్తామని జైట్లీ భరోసా ఇచ్చారని హరిబాబు చెప్పారు.
ఏపీ రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి నిదుల కేటాయింపు విషయంలో న్యాయం జరగలేదని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన బాట పట్టాయి. బిజెపి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న టిడిపి కూడ బిజెపి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది.
దీంతో టిడిపి, బిజెపి ప్రతినిధులు సోమవారం రాత్రి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజల అభిప్రాయాల.పై చర్చించారు. ఏపీ రాష్ట్రానికి దక్కాల్సిన నిధుల విషయమై చర్చించారు. మరోసారి కూడ సమావేశం కావాలని నేతలు నిర్ణయం తీసుకొన్నారు. అయితే కేంద్రం నుండి స్పష్టత వచ్చేవరకు టిడిపి ఎంపీల నిరసన పార్లమెంట్ సమావేశాల్లో కొనసాగనుంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా 90 శాతం నిధులిస్తారు
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కానీ, హోదాతో సమానమైన ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్రానికి అందించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఒప్పుకొన్నారని ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, బిజెపి ఎంపీ కంభంపాటి హరిబాబు చెప్పారు. ఈ 60, 90 శాతానికి మధ్య ఉన్న నిధులు ఏ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు వస్తాయి, ఈ నిధులన్నింటీని ఏపీకి ఎలా ఇవ్వాలనే దానిపై కూడా చర్చ జరిగిందని హరిబాబు చెప్పారు.

మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది
ప్రత్యేక హోదాకు సమానమైన ప్రయోజనాలను రాష్ట్రానికి ఇవ్వాలని కోరామని కంభంపాటి హరిబాబు వ్యాఖ్యానించారు. నిధులు ఇచ్చే విషయంలో ఆలస్యం జరుగుతుందన్న భావన ఉందని, ఆర్థికలోటు భర్తీ అంశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. మరో రెండు, మూడు రోజుల్లో ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయమై స్పష్టత వస్తుందని తెలిపారు.

ప్రత్యేక హోదాపై చర్చ
ప్రత్యేక హోదా ఇస్తే ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కలుగుతుందోననే విషయమై చర్చించారు. ఆ ప్రయోజనాన్ని పూర్తిగా కేంద్రం అందించే విషయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలల్లో ప్రత్యేక హోదా ఇస్తే 90 శాతం నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. 10 శాతం నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలి. హోదా లేకపోతే 60 శాతం కేంద్రం, 40 శాతం నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలనే విషయమై చర్చించినట్టు కంభంపాటి హరిబాబు చెప్పారు.

విభజన సమస్యలపై చర్చ
ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలపై కూడ ఈ సమావేశంలో చర్చించినట్టు బిజెపి ఎంపీ హరిబాబు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు, రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. హమీలను నెరవేర్చకపోతే రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నేతలు జైట్లీ దృష్టికి తీసుకెళ్ళారు.

న్యాయపరమైన హక్కులపై చర్చ
న్యాయపరమైన హక్కులను అమలు చేయాలనే విషయమై చర్చించినట్టు బిజెపి ఎంపీ హరిబాబు చెప్పారు. ఈ విషయమై ఇతర మంత్రులతో కూడ చర్చిస్తానని జైట్లీ తమకు చెప్పారని హరిబాబు గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications