వెంకటేశ్వరుడికి ఇస్తే అందరూ అడుగుతారు: బాబుకు జైట్లీ షాక్, కేసీఆర్‌కూ..

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: జిఎస్టీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంకు మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ఒకరికి మినహాయింపునిస్తే దేశవ్యాప్తంగా అలాంటి సంస్థలన్నీ అదే వెసులుబాటు కోరతాయని పేర్కొన్నారు.

జిఎస్టీలో తిరుమలకు మినహాయింపు ఇవ్వాలని తాము కోరుతామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల చెప్పారు. ఆ మేరకు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం మాత్రం అంగీకరించలేదు. తిరుమలకు మినహాయింపు ఇచ్చేందుకు నో చెప్పారు.

Arun Jaitley Ignores Chandrababu Naidu and KCR Requests over GST

ఈ అంశంపై అరుణ్‌ జైట్లీకి విజ్ఞాపన పత్రం అందించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. దీనిపై చర్చించడానికి తాజా సమావేశంలో సమయం దొరకలేదని, వచ్చే సమావేశంలో చర్చిస్తామని చెప్పారు.

జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న తిరుమలకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ నుంచి మినహాయింపునిచ్చిందని, కాబట్టి జీఎస్టీలోను దానిని కొనసాగించాలని అడిగినట్లు యనమల చెప్పారు.

మరోవైపు, అలాగే తెలంగాణ మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు, గ్రానైట్ ఇండస్ట్రీస్‌కు ప్లాస్టిక్ చైర్, బిస్కట్, హ్యాండ్లూమ్ తదితర పరిశ్రమలను మినహాయించాలని కోరింది. దీనికి కూడా కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. తెలంగాణ 34 అంశాలపై జిఎస్టీ మినహాయింపు కోరితే రెండింటికి ఆమోదం తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The representation given by AP Government over Tax Rates haven't been taken into confidence by the GST Council. Whereas, Two of the 34 Proposals placed by Telangana Government were approved.
Please Wait while comments are loading...